తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ తొలి తెలుగు స్వాతంత్య్ర సమ‌ర‌ యోధుడు.. క‌ర్నూలు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా తెర‌కెక్కింది. చిరు త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మాతగా సైరా సినిమా తెర‌కెక్కింది.


సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ గా వచ్చిన ‘సైరా నరసింహా రెడ్డి’ తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డం, మ‌ళ‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కింది. పాజిటివ్ మౌత్ టాక్ తో, ఆంధ్ర, తెలంగాణలో మొదటి రోజు 38.22 కోట్ల షేర్ కలెక్ట్ చేసి తన సత్తా ఏంటో చాటుకుంది. ఆరు ప‌దుల వ‌య‌స్సులో సైతం చిరు చేస్తోన్న న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ల‌భించింది.


ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కూడా మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది. తొలి రోజుతో పోలిస్తే రెండో క‌లెక్ష‌న్ల‌లో చాలా డ్రాప్ క‌నిపించినా ఓకే అనిపించుకుంది. తొలి రోజు సైరా తెలుగు రాష్ట్రాల్లో 10.1 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి 2 రోజుల్లో 48.32 కోట్ల షేర్ దగ్గర నిలిచింది. అయితే ఇక్క‌డే ఈ సినిమాకు రు.106 కోట్లు వ‌స్తే గాని బ్రేక్ ఈవెన్ కాదు. దీంతో సైరా ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంది.


ఏరియాల వారీగా ‘సైరా’ రెండో రోజు కలెక్షన్స్ వివరాలు...


నైజాం = 12.99


సీడెడ్ = 7.83


గుంటూరు = 5.72


ఉత్తరాంధ్ర = 6.35


ఈస్ట్ = 5.29


వెస్ట్ = 4.87


కృష్ణా = 3.76


నెల్లూరు =  2.41  
----------------------
మొత్తం = 48.32
----------------------


ఏపీ / తెలంగాణ రెండు రోజుల షేర్ : 48.32 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: