త‌మిళ తంబీలు అమ్మ‌గా, పురుచ్చత‌లైవీగా పిలుచుకొనే జ‌య‌ల‌లిత కొద్ది రోజుల క్రితం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆమె జీవితంలో ఎన్నో అద్భుత ఘ‌ట్టాలు ఉన్నాయి. వాటిని వెండితెరపై చూపించేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో జ‌య‌ల‌లిత‌గా బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తుంది. ఈ చిత్రంలో ఎం.జి.ఆర్(మ‌రుతూర్ గోపాల రామ‌చంద్ర‌న్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి న‌టిస్తున్నారు. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది.


విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ సినిమాకు ర‌చ‌యిత‌గా ప‌నిచేస్తున్నారు. హిందీ, త‌మిళం, తెలుగు భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంగ‌నా ర‌నౌత్‌, అర‌వింద స్వామి న‌టిస్తున్న ఈ చిత్రంలో ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఎల్‌.విజ‌య్‌,  నిర్మాత‌లు: విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్‌, ర‌చయిత‌: విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.


ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల నిర్మాత విష్ణు ఇందూరి భారీ బడ్జెట్‌తో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో నటించనుంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం కసరత్తులు ప్రారంభించిన కంగనా విదేశాల్లో మేకప్‌ టెస్ట్‌లు కూడా చేశారు. అంతేకాదు తెర మీద జయలా కనిపించేందుకు బరువు కూడా పెరుగుతున్నారు.  ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది.


విజ‌యేంద్రప్ర‌సాద్ ఈ సినిమాకు ర‌చ‌యిత‌గా ప‌నిచేస్తున్నారు. హిందీ, త‌మిళం, తెలుగు భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960 మ‌ధ్య కాలంలో టాప్ హీరోయిన్‌గా అలరించిన అందాల న‌టి జ‌య‌లలిత తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌,భాష‌ల‌లో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది . భార‌త రాజ‌కీయాల‌లోను ముఖ్య భూమిక పోషించిన జ‌య‌ల‌లిత దాదాపు 14 సంవత్స‌రాల‌కి పైగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: