బాలీవుడ్‌లో నవ్యత, వైవిధ్యతకు అక్షయ్‌కుమార్ సినిమాలు చిరునామాగా నిలుస్తుంటాయి. తాజాగా ఆయ‌న న‌టించిన‌ చిత్రం లక్ష్మిబాంబ్‌. అందులో  ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించబోతున్నారు అక్షయ్‌. సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను గురువారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌లో నుదుట పెద్ద తిలకం, ముక్కుపుడకతో ఎరుపురంగు చీర ధరించి మహిళా వేషధారణలో వినూత్నంగా కనిపిస్తున్నారాయన. లక్ష్మి అనే పాత్రలో నటిస్తున్నాను. కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడినప్పుడే అసలైన జీవితం ప్రారంభమవుతుంది అంటూ అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు. తమిళ చిత్రం కాంచన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో హిజ్రా పాత్రను ఎవరు పోషించబోతున్నారనే విషయంలో అమితాబ్ బచ్చన్ పేరు వినిపిస్తోంది. కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 20న విడుదల చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ ని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 'కాంచన 2' చిత్రాన్ని కన్నడలో ఉపేంద్ర రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. కాగా.. దేవి నవరాత్రుల సందర్భంగా అక్షయ్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ  సినిమాకు సంబందించి షూటింగ్ కూడా రీసెంట్‌గా షురూ అయ్యింది. అయితే విడుదలైన ఈ ఫస్ట్‌లుక్.. ఓ పెద్ద వివాదానికి దారి తీసింది. దర్శకుడు లారెన్స్‌ను అడగకుండా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారట చిత్రబృందం.


ఇదే విషయంపై లారెన్స్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆయన మాటల్లో.. 'తమిళంలో ఓ నానుడి ఉంది. గౌరవం లేని ఇంట్లో అడుగు పెట్టకూడదని, అంతేకాదు.. ఈ ప్రపంచంలో పేరు, ప్రతిష్టల, డబ్బు కంటే వ్యక్తిగత గౌరవం చాలా ముఖ్యమైంది. కనుక 'లక్ష్మీ బాంబ్' ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేస్తున్నాను. అయితే దీనికి ఒక్క కారణమని చెప్పలేను. 



మరింత సమాచారం తెలుసుకోండి: