ఈ మద్య కాలంలో బయోపిక్ మూవీస్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  తెలుగు, తమిళ, మళియాళ,హిందీ భాషల్లో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి.  తెలుగు లో సినీ నేపథ్యంలో మాహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ మూవీ వచ్చింది.  ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు ఎన్నో అవార్డులు, రివార్డులు కైవసం చేసుకుంది. 

ఆ తర్వాత మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ బయోపి’ రెండు పార్టులు దారుణ ఫలితాన్ని పొందాయి.  దాంతో సినీ నేపథ్యంలో బయోపిక్ లు అంటే కాస్త ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటున్నారు నిర్మాతలు.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా తన బయోపిక్ విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. తన బయోపిక్ మూవీ గనక తీయాలనుకుంటే మాత్రం తన పాత్రలో రాంచరణ్ అస్సలు నటించవొద్దని అన్నారు. రాంచరణ్ మంచి నటుడు అని అందరికీ తెలిసిందే..అయితే నా యుక్త‌వ‌య‌సులో నా రూపానికి త‌గ్గ‌ట్టుగా సాయిధ‌ర‌మ్, వ‌రుణ్ తేజ్, వైష్ణ‌వ్ ల‌లో పోలిక‌లు క‌నిపిస్తాయి. వాళ్ల‌లో ఎవ‌రో ఒక‌రు న‌టిస్తే బావుంటుంది అని తెలిపారు. అయితే భవిష్యత్ లో మెగాస్టార్ బయోపిక్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ మూవీ ఎవరు దర్శకత్వం వహిస్తారో అన్న విషయం మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చే వరకు సస్పెన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: