‘సైరా’ కు వచ్చిన టోటల్ పాజిటివ్ టాక్ స్థాయిలో ఈ మూవీ కలక్షన్స్ లేకపోయినా ఈ మూవీ కలక్షన్స్ రేపటి నుండి ప్రారంభం అయ్యే వీకెండ్ మరియు దసరా పండుగ సెలవులతో కలక్షన్స్ ఊపందుకుంటాయని బయ్యర్లు భావిస్తున్నారు. ఈ సినిమాలో నటించిన చిరంజీవి నుండి చిన్నచిన్న పాత్రలు పోషించిన నటీ నటులు అంతా ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు.

ఈ మూవీలో ఒక చిన్న పాత్ర ఇమ్మని నటుడు బ్రహ్మాజీ చరణ్ ను అడిగితే అతడికి ఏకంగా ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్రను ఇవ్వడమే కాకుండా బ్రహ్మాజీని ఊహించని విధంగా చరణ్ టార్చర్ పెట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా బ్రహ్మాజీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. 

 ఈ సినిమాలోని తన పాత్ర కోసం హార్స్ రైడింగ్ నేర్చుకోవడమే కాకుండా తన పాత్ర సహజత్వం కోసం చరణ్ సూచనతో గుండు కొట్టించుకున్న విషయాన్ని బ్రహ్మాజీ బయటపెట్టాడు. అంతేకాదు చరణ్ దగ్గర ఉండి  తనకు గుండు కొట్టించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఈ విషయానికి సంబంధించి చరణ్ దగ్గర ఉండి తనకు గుండు కొట్టించిన ఫోటోను బ్రహ్మాజీ తన ట్విట్టర్ లో షేర్ చేసాడు. 

ఇలా ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు అంతా ఈ మూవీ కోసం ఎంతో కష్టపడినా ఈ మూవీ కలక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. వాస్తవానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర తెలుగు ప్రజలకు పరిచయం లేకపోవడం వలన కూడ ఈ మూవీకి ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ కాలేకపోతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికితోడు ఈ మూవీలోని సంఘటనలు అదేవిధంగా ఈ మూవీలోని పాత్రలు ఎవరికీ పూర్తిగా తెలియనివి కావడంతో ఎదో ఒక అసహజమైన కథను వెండితెర పై చూస్తున్నాము అన్న ఫీలింగ్ ప్రేక్షకులలో కలుగుతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: