నట శిక్షకులు ఎన్.జె. భిక్షు, అరుణ బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నది. ఆ తర్వాత 2006లో ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన దేవదాసు చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో ఆమె రామ్ సరసన నటించింది. ఇద్దరికీ తొలిచిత్రమైన ఈ సినిమా విడుదలయ్యాక సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఇద్దరి నటనకూ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులను సాధించారు. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. ఒక పోలీస్ అధికారిచే వేధించబడే శృతి అనే ఎయిరోబిక్స్ టీచర్ పాత్రను పోషించింది ఇలియానా. ఈ చిత్రం విడుదలయ్యాక నాటి తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయమై నిలిచింది. పోకిరి సినిమా విజయంతో ఇలియానా తెలుగు సినిమాలో పేరొందిన నటిగా అవతరించింది.

2012లో ఇలియానా శంకర్ దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ సరసన నన్బన్ చిత్రంలో నటించింది. ఇది హిందీ చిత్రం త్రీ ఈడియట్స్ చిత్రం యొక్క పునఃనిర్మాణం. త్రీ ఈడియట్స్ లాగే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆపై త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన జులాయి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా అనూహ్యమైన రీతిలో విజయం సాధించింది. అదే ఏడాది రవితేజ సరసన దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించింది. ఈ చిత్రం మాత్రం పరాజయం పాలైంది. కానీ ఇందులో రవితేజ మరియూ ఇలియానాల నటనకు మంచి ప్రశంసలందాయి.

ఇలియానా.. నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఈ ముద్దుగుమ్మ.. దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది. కాగా ఆ మధ్య కొంచెం బొద్దుగా కనపడిన ఇలియానా.. కొంచెం కష్ట పడి ఇప్పుడు సన్నగా సన్నజాజిలా అదరగొడుతోంది. ఆమె కొత్త లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో వైరల్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: