బాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రణ్ వీర్ సింగ్ తాజాగా ముంబై వీధుల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు.  ఆ మద్య బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రణ్ వీర్ సింగ్ ఎప్పుడూ ఏదొ ఇక వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి తనదైన స్టైల్లో ముంబాయి వీధుల్లో తన కొత్త కారుతో హంగామా సృష్టించాడు. ఎప్పుడూ మోడ్రన్ గా కనిపించే రణ్ వీర్ సింగ్ కి బైక్స్, కార్లు అంటే చాలా మోజు.  ఈ నేపథ్యంలో ఆయన ఓ ఖరీదైన కారు కొన్నాడు. ఇటీవల  'గల్లీ బాయ్' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం '83' అనే సినిమాలో నటిస్తున్నాడు.


తాజాగా రణ్ వీర్ సింగ్ భారత స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మద్య దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ హీరో తన కొత్త కారులో ముంబైలో షికారు చేస్తూ కనిపించారు. ఇంకా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ రాని కారులో రణవీర్ షికారు చేస్తూ.. కొత్త కారు కొన్న విషయాన్ని తెలియజేశాడు. లాంబోర్ఘినీ యూరస్ మోడల్ కారు..ఈ కారు భారత్ లో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇక ఈ కారు విలువ కూడా చాలా ఖరీదు.  మూడు కోట్లకు పై మాటే.. వినడానికి ఇది షాక్ గా ఉన్నా మన హీరోకి మాత్రం చాలా సింపుల్ రేట్ అంటున్నారు అభిమానులు. 


ఈ మద్యే రణవీర్ ఈ కారును సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ కారుని తనే స్వయంగా ముంబై  వీధుల్లో నడుపుతూ ఫోటోలను ఫోజులిచ్చాడు.ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే రణవీర్ కి మూడు కోట్లు అనేది తను ఒక సినిమా తీసుకునే రెమ్యునరేషన్ లో నాలుగో వంతు అందుకే ఇలాంటి ఖరీదైన కార్లు కొటుంటారని అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: