మ్యాచోస్టార్‌ గోపిచంద్‌ది ప్రత్యేకమైన శైలి. ఒకవైపు రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్త కథలతో ప్రేక్షకుల్ని మెప్పించాలన్న తపన పడే హీరో ఆయన.  లేటెస్ట్‌గా ఒక స్పై థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌'చాణక్య'తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు.  తిరు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అగ్ర నిర్మాత అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.  మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటించగా బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. ఈ సంద‌ర్భంగా గోపిచంద్ మీడియాతో  సినిమా గురించి పంచుకున్నారు.


నిజానికి చాణక్య మూవీని మేము ‘మే’ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాము, కానీ, నేను గాయపడిన తరువాత షూటింగ్ ఆలస్యం అయింది. ఇక ఆ తరువాత, అక్టోబర్ 3న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాము, అప్పటికీ సైరా విడుదల తేదీ ప్రకటించలేదు. ఇక సైరా అక్టోబర్ 2 విడుదల అని ప్రకటించాక, మేము అక్టోబర్ 5న చాణక్య రిలీజ్ ప్లాన్ చేశాము.


దసరా హాలిడేస్ కాబట్టి రెండు సినిమాలను ప్రేక్ష‌కులు ఆదరిస్తార‌ని భావిస్తున్నాను.పైగా చాణక్య మరియు సైరా రెండు సినిమాలు వేరు వేరు నేపథ్యాలకి సంబంధించిన సినిమాలు. మ్యాచోస్టార్‌ గోపిచంద్‌ది ప్రత్యేకమైన శైలి. ఒకవైపు రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్త కథలతో ప్రేక్షకుల్ని మెప్పించాలన్న తపన పడే హీరో ఆయన.  లేటెస్ట్‌గా ఒక స్పై థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌'చాణక్య'తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు.  తిరు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అగ్ర నిర్మాత అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.  మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటించగా బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. ఈ సంద‌ర్భంగా గోపిచంద్ మీడియాతో  సినిమా గురించి పంచుకున్నారు. సినిమా రిలీజ్‌కి ముందు ఫైనల్‌గా వారి జడ్జిమెంట్‌ తీసుకుందామని మాకు బాగా క్లోజ్‌ సర్కిల్‌, వెల్‌ విషర్స్‌కి షో వేశాం. యునానిమస్‌గా ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అన్నారు. ఆడియన్స్‌ నుండి కూడా అలాంటి రెస్పాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం.



మరింత సమాచారం తెలుసుకోండి: