ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పైకి ఎంత ఈజీగా వెళ్తున్నాయో..థియేటర్లోకి అన్ని కష్టాలు పడుతూ రిలీజ్ అవుతున్నాయి. స్టోరీ లైన్ కాపీ అంటూ ఒకటి..నా మ్యూజిక్ కాపీ చేశారని ఒకటి..మా మనోభావాలు దెబ్బతింటున్నాయని ఒకటి..ఇలా ఒకటి కాదు రెండు కాదు షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్స్ చేసుకొని థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు దర్శక, నిర్మాతలకు వెన్నుల్లో వనుకు పుడుతున్న సమయం ఇది. ఈ మద్య హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘గద్దల కొండ గణేష్’ ఈ మూవీ మొదటి పేరు వాల్మీకి అనుకున్నారు..ఇదే పేరుతో పబ్లిసిటీ కూడా అయ్యింది.

వాల్మీకీ పేరు పెడితో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని..ఇది ఒక రౌడీ షీటర్ సినిమా..ఆయన రామాయణం రాసిన మహాయోగి అలాంటి వారి పేరు ఎలా పెడతారని విమర్శలు వచ్చాయి. బోయ కులస్తులు ఈ మూవీ ససెమిరా ఆడనివ్వమని మొండికేశాయి.  మొత్తానికి రిలీజ్ కి ఒక్కరోజు ముందు వాల్మీకి పేరు కాస్త ‘గద్దలకొండ గణేష్’ గా మార్చి రిలీజ్ చేశారు.  అయితే ఈ మూవీ మొదటి నుంచి మంచి అంచనాలే అందుకుంది.

రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈసినిమా హిందీ డబ్బింగ్ విషయంలో కోటిన్నర రూపాయలు కొనుగోలుదారుల నుంచి ఏదో నిబంధన ఉల్లంఘన నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో మన మేకర్స్ యాభై లక్షలు ఇస్తాం అని చెబుతున్నారు కానీ వాళ్ళు ససేమీరా అంటున్నారు అని తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: