తమిళ సంచలనం ఇళయ దళపతి విజయ్ ని కలవాలని ఎవరికీ మాత్రం ఉండదు చెప్పండి?    విజయ్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడైనా కోరుకుంటారు. ఏకంగా విజయ్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు మన తెలుగు డైరెక్టర్  లోకేష్ కనకరాజ్.కొంతకాలం క్రితం ఈ యువ డైరెక్టర్  లోకేష్ కనకరాజ్ తెలుగు యువ హీరో సందీప్ కిషన్ తో 'నగరం' అనే ఓ సినిమాను చేసాడు. వీరిద్దరూ మంచి మిత్రులు కూడా.  
ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరో సందీప్ కిషన్.. కొంత కాలం పాటు సరైన హిట్ లేక వెనకబడ్డాడు. 

అయితే జానర్ మార్చి సినిమాలు చేసినా.. లక్ మాత్రం కలిసి రావడం లేదు. రీసెంట్గా వచ్చిన నిను వీడని నీడను నేను అనే చిత్రం వరుస అపజయాల నుంచి కాస్త ఊరటనిచ్చింది. అయితే సందీప్ కిషన్.. తాజాగా చేసిన ట్వీట్ వైలర్ అవుతోంది.ఇక తన స్నేహితుడైన లోకేష్ ఇళయ దళపతి విజయ్ ని డైరెక్ట్ చేసే లక్కీ చాన్స్ వచ్చినందుకు ఈ హీరో చాలా సంబరపడుతున్నాడు. అయితే దాంట్లోనూ ఈ హీరోకు చిన్న ఆశ కూడా దాగి ఉంది. 



అదేటంటే.. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్లి విజయ్ ను చూద్దామని అనుకుంటున్నాడట.  ఇదే విషయాన్ని తన స్నేహితుడికి సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. నాకెంతో గర్వంగా ఉంది మచ్చా.. నేనిక ఎదురుచూడలేకపోతున్నా.. నిన్ను చూడటానికి సెట్స్ కు వస్తా అలాగే విజయ్ సార్ ను కలుస్తా అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు.. స్క్రీన్ పై నువ్వు చేయబోయే మ్యాజిక్ గురించి ఎదురుచూస్తున్నా.. అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ ప్రస్తుతం తెనాలి రామక్రిష్ణ బీఏ బీఎల్ చిత్రాన్ని చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: