కొన్ని సంవత్సరాల ముందు మన తెలుగు హీరోలు ప్రతి సినిమాలో ఒక్కటే లుక్ తో కనిపించి బోర్ కొట్టించేవారు. కానీ జనరేషన్ మారే కొద్దీ తెలుగు హీరోలు చాలా స్పీడ్ గా అప్డేట్ అయ్యారు. ఇప్పుడున్న తెలుగు హీరోలలో 90 శాతం మంది హీరోలు సిక్స్ ప్యాక్ చేసిన వాళ్లే ఉన్నారు. బాలకృష్ణ లాంటి హీరో కూడా ఇప్పుడు రాబోతున్న సినిమా కోసం చాలా కష్టపడి స్లిమ్ గా కనిపిస్తున్నారు. అంతేకాదు యంగ్ హీరో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రభాస్, రానా, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ సినిమా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు. మేకోవర్ పేరుతో సినిమాకొక రకంగా కనిపిస్తు తమ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ బాడీని వాళ్లే విపరీతంగా కష్టపెట్టి బరువు తగ్గుతూ పెరుగుతూ క్యారక్టర్ కి సరిపోయేలా మారిపోతున్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని కెరీర్ స్టార్ట్ అయినప్పుడే కొంచెం బొద్దుగా ఉండేవాడు. రాఖీ సినిమా టైం లో అయితే చాలా లావు అయిపోయాడు. దీంతో అతనికి ఎంతో దగ్గరైన రాజమౌళి లాంటి వాళ్ళు హెచ్చరించడంతో బరువు తగ్గాలని డెసిషన్ తీసుకున్న ఎన్టీఆర్.. కొన్ని నెలల్లోనే స్లిమ్ గా తయారయ్యి కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్నింటిలో అలాగే ఉన్నాడు. ఇక కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో మళ్ళీ కొంచెం లావైనట్టు కనిపించినా అరవింద సమేతలో మళ్లీ స్లిమ్ అయ్యాడు.

ఇప్పుడు మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమాలో తారక్ చేస్తున్న కొమరం భీం క్యారక్టర్ కు రెండు షేడ్స్ ఉంటాయని సమాచారం. అందులో ఒక లుక్ కోసం ఎన్టీఆర్ ఇప్పుడు బాగా వెయిట్ తగ్గి చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతు నందమూరి ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.  ఇక తారక్ ఈ సినిమా తర్వాత మళ్ళీ కొరటాల శివ తో ఒక సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నాడు. అయితే ఇది కాకుండా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ లో ఒకటి, తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఒక సినిమాని కమిటయినట్టు వార్తలు వచ్చాయి. మరి తారక్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత చేసే సినిమా ఏంటో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: