అమ్మాయిల కోసం వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయిన విజ‌య‌దేవ‌రకొండ‌. మ‌రి అబ్బాయిల‌కోసం ఫుట్ వేర్ స్టైల్‌ని అందిస్తున్నాడు.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. చేతిలో సిగరెట్ పట్టుకుని ముఖం నిండా రక్తంతో కారుతున్న దెబ్బలతో విజయ్ కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కె. క్రాంతిమాధవ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్ కాస్త అర్జున్ రెడ్డి పోస్టర్‌ను తలపిస్తోంది. అందులోనూ విజయ్ లుక్ ఇంచు మించు ఇలాగే ఉంటుంది.
 
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ లుక్ తో ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాడు.తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ కోసం చేసిన ఫొటోషూట్ స్టిల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి.
 
తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేసిన విజయదేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారాడు. ప్రత్యేకత, నాణ్యత, భారతీయతను మేళవించి రౌడీ బ్రాండ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఒక సెలబ్రిటీ ఇమేజ్ తో నడుస్తున్న తొలి బ్రాండ్ ఇదే కావడం విశేషం. తన స్టైయిల్ స్టెట్ మెంట్స్ తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ లోకి కూడా తన మార్క్ ని చూపబోతుంది.  త్వరలోని విస్తరించబోతున్న ‘స్ట్రీట్ వేర్’ బ్రాండ్  ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్ గా మారబోతుంది. మరి అర్జున్ రెడ్డి స్థాయిలోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుందో లేదో చూడాలి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అన్న టైటిల్‌తోనే సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: