మన టాలీవుడ్ స్టార్ హీరోలకి యంగ్ హీరోల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అలానే ప్రేక్షకుల అభిరుచి ఎప్పటికప్పుడు మారుతుంది. అంతేకాదు టెక్నికల్ గా మారిన ట్రెండ్ కూడా ఛాలెంజింగా ఉంది. ఈ పోటీ ప్రపంచంలో వీటన్నిటిని తట్టుకుని ఇంకొంత కాలం లైమ్ లైట్ లో వుండాలంటే శ్రమించక తప్పదు. వయసుతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయాల్సిందే. అందుకు ఒళ్లు హూనం చేసుకొని మరీ ప్రేక్షకులకు నచ్చినట్లుగా కనిపించడానికి భారీగా కసరత్తులు చేయాల్సిందే. టాలీవుడ్ లో ఆరు పదులు దాటిన హీరోలకు ఇప్పడు ఇదే కష్టమొచ్చింది. ఒకప్పుడు డూప్ లతో మ్యానేజ్ చేశారు. కానీ ఇప్పుడు డూప్ లను ఉపయోగిస్తుంటే ప్రేక్షకులు ఇట్టే కనిపెట్టేస్తున్నారు. రజనీకాంత్ రోబో, బాహుబలి లో ప్రభాస్ లకు డూప్స్ కి వాడిన సీన్స్ ని జనాలు ఇట్టే పట్టేశారు.

పైగా 60 ఏళ్ళు వెనక వస్తున్న తెరపై కనిపించాలంటే మాత్రం ఆ వయసు అన్నట్టు కనిపించకూడదు. అంటే అందుకు తగ్గట్టుగా కసరత్తులు చేయాలి. ముఖం పై ముడతలు కనిపించకుండా గ్రాఫిక్స్ చేయోచ్చు. కానీ బాడీ షేపులు మాత్రం మెయింటెయిన్ చేయాల్సిందే కాబట్టి హీరోలంతా జిమ్ముల్లో కఠోరంగా శ్రమిస్తున్నారు. చిరంజీవి - బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున వీళ్లంతా రెగ్యులర్ గా జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్నారు. చిరు ఏజ్ 60 ప్లస్. అయినా పోటీలో నిలబడాలంటే శ్రమించక తప్పదని తెలుసుకుని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా కోసం వర్కవుట్ లు చేస్తూ బరువు తగ్గించుకుంటున్నారు. నాగార్జునకు ఈ ఆగస్టులో 60 వచ్చింది. ఆయినా వర్కవుట్లు చేస్తూ నవ మన్మధుడిగా కనిపించడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ యుక్తవయసులో రెగ్యులర్ గా జిమ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏజ్ ఎక్కువ అవడం మూలానా వాకింగ్..ధ్యానంతో మేనేజ్ చేస్తున్నారు.

నటసింహా నందమూరి బాలకృష్ణ కూడా 60కి దగ్గర్లో ఉన్నారు. అయినా కసరత్తులు మొదలుపెట్టారు. బోయపాటి సినిమా కోసం ఏకంగా 25 కేజీలు తగ్గడానికి చాలా శ్రమిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ 55 పైనే. ఆయన కూడా పోటీలో వుండాలంటే కసరత్తులు తప్పలేదు. మెడిటేషన్.. వివేకానందుని ఫాలోవర్ గా ఆయన శైలి ఇతర హీరోల కంటే విభిన్నం. అదే ఆయన ఆరోగ్యానికి పెద్ద ప్లస్. ఇలా 60 ఏళ్ళలోను ఎంతో శ్రమిస్తు బాడీని బాగా మేయింటేయిన్ చేస్తూ తమ ఫ్యాన్స్ కోసం యంగ్ హీరోస్ లా కనిపించడానికి ట్రై చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: