టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వాళ్లు ఉండరేమో.. అంతగా పాపులర్ అయ్యాడు.. రాఘవేంద్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఆరడుగుల అబ్బాయి ఆ తర్వాత ఈశ్వర్ సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా బాగా హిట్ అవ్వడంతో.. ఆ తరువాత వరుస సినిమాలలో నటిస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాలు  చేస్తున్నాడు. ఎన్నో హిట్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందిస్తున్నారు. మొన్న వచ్చిన బాహుబలి సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయం. ఆ తర్వాత వచ్చిన సాహో మాత్రం ప్రభాస్ కి నిరాశనే మిగిలిచ్చింది.


ప్రభాష్ చాలా సినిమాలలో నటించారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి ప్రపంచ గుర్తింపు పొందారు. ఆ సినిమా తరువాత దాదాపుగా రెండేళ్లు గ్యాప్ తీసుకొని యాక్షన్ కథ తో తెరకెక్కిన ఓ సినిమాలో నటించారు. ఆ సినిమానే సాహో.. ఈ సినిమా ఆగస్టు 30  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇకపోతే కథాబగలేదనే టాక్ తో ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. 



ఆ సినిమాకు అనుకున్నంత ఫలితాలు రానందున బాధపడిన డార్లింగ్ కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇకపోతే కృష్ణంరాజు ఫ్యామిలీతో కలిసి జాలీ ట్రిప్  ఎంజాయ్ చేస్తున్నారు.  ఈ ఫ్యామిలీ అక్కడ ప్రదేశాల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు..ఆ ఫొటోలకు కామెంట్లు వచ్చి పడుతున్నాయి. 



ఈ సినిమా అనుకున్న రీతిలో రానందున.. బాలీవుడ్ లో సినిమా తీయలనే ఆలోచనలో ప్రభాష్ ఉన్నట్లు అర్థమవుతుంది.. దానికి కోసం వెనుక పనులు కూడా పూర్తయ్యాయి. హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న రావణ చిత్రంలో రావణుడి పాత్రలో కనిపించి మెప్పిస్తానని ప్రభాష్ వెల్లడించారు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: