‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేస్తుంది అన్న అంచనాలతో వచ్చిన ‘సైరా’ కలక్షన్స్ విషయంలో ఎదురీత ఈదుతున్న పరిస్థితులలో ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషిస్తూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆశక్తికర కథనాన్ని ప్రచురించింది. ‘సైరా’ మూవీకి తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజున 37 కోట్ల 93 లక్షల రూపాయల షేర్ వస్తే రెండో రోజు ఈవసూళ్లు కేవలం 10 కోట్ల 10 లక్షలకు పడిపోవడం షాకింగ్ గా మారింది అంటూ ఈ పరిస్థితికి గల కారణాల పై ఆశక్తికర విశ్లేషణలు చేసింది. 

ఈ మూవీ ఉత్తరాది ప్రాంతంలో ఫెయిల్ అవ్వడం పెద్ద షాక్ కాకపోయినా చిరంజీవిని మెగా స్టార్ గా ఆరాధించే లక్షలాది మంది మెగా అభిమానులు ఉన్న తెలుగు రాష్ట్రాలలో కూడ ‘సైరా’ ఎదురీత ఏర్పడటం షాకింగ్ గా మారింది అంటూ ఆ పత్రిక కొన్ని కామెంట్స్ చేసింది. ‘సైరా’ కు ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి గల ప్రధాన కారణం గురించి కామెంట్స్ చేస్తూ ‘సైరా’ గొప్ప సినిమా అయినప్పటికీ ఈ మూవీ కథలో ప్రేక్షకులకు మనసుకు హత్తుకునే సీన్స్ మిస్ అవ్వడం ‘సైరా’ పరాజయానికి ఒక కారణం అంటూ తన విశ్లేషణలు కొనసాగించింది. 

ఉదాత్తమైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో నటించిన చిరంజీవి తన నటనలో పరాకాష్టను ప్రదర్శించినా ఈ మూవీలో ఉయ్యాలవాడ లక్ష్మిల పాత్రల మధ్య అనవసరంగా క్రియేట్ చేసిన రొమాంటిక్ సీన్స్ ఉయ్యాలవాడ పాత్ర పై ప్రేక్షకులకు ఉన్న గౌరవాన్ని తగ్గించాయి అన్న అభిప్రాయాన్ని ఆ పత్రిక వ్యక్త పరిచింది. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఈ మూవీ తమిళ మళయాళ కన్నడ హిందీ ప్రేక్షకులకు కూడ నచ్చకపోవడంతో ఈ మూవీ గ్రాఫిక్స్ భారీ నిర్మాణ విలువల పై పెట్టిన శ్రద్ధ సినిమా కథ పై పెడితే బాగుండేది అంటూ ఆ పత్రిక అభిప్రాయ పడుతోంది.

దీనికితోడు రొమాంటిక్ సీన్స్ లో చిరంజీవి ముఖ కవళికలలో కనిపించిన వయసుతో వచ్చే మార్పులు ఎంతో అనుభవం ఉన్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఎందుకు గుర్తించలేదు అని ఆ పత్రిక ప్రశ్నించింది. ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చిరంజీవి గతంలో నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ లో ఉన్నప్పటికీ ఒక ఉదాత్తమైన ఉయ్యాలవాడ పాత్రను పోషిస్తున్న చిరంజీవి రొమాంటిక్ సీన్స్ లో నటించడం సగటు ప్రేక్షకుడు హర్షించలేకపోయాడు అన్న విషయం ఆ పత్రిక కామెంట్స్ చేసింది..


మరింత సమాచారం తెలుసుకోండి: