టాలీవుడ్ లో కమెడియన్ గా వచ్చిన బబడ్ల గణేష్ ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిపోయాడు. మొదట బుల్లితెరపై కనిపించిన బండ్ల గణేష్ చిన్న చిన్న పాత్రలతో వెండి తెరపై కనిపించాడు.  ఆ తర్వాత స్టార్ కమెడియన్ స్థాయికి ఎదిగిన బండ్ల గణేష్ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాడు.  ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. 

కానీ అది ఎంతో కాలం లేదు..తెలంగాణ లో ఎన్నికల రిజల్ట్ రావడం..టీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలవడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పాడు. నిన్న అర్థరాత్రి ఇంటికి వెళ్లి పీవీపీని బెదించిన బండ్ల గణేష్ మనుషులు.  ఈ నేపథ్యంలపై జూబ్లీహిల్స్ పోలీసులకు పీవీపీ ఫిర్యాదు చేశారు. బండ్ల గణేష్ తో సహా మరో నలుగురిపై కేసు నమోదు.  పీవీపీ ఇంట్లో నిర్మాత బండ్ల గణేష్ హల్ చల్. టెంపర్ సినిమాకు రూ.7 కోట్లు ఫైనాన్స్ చేసిన పీవీపీ. ఈ నేపథ్యంలో కొంత కాలంగా బండ్ల గణేష్ ని డబ్బులు అడుతుగున్న పీవీపీ.

దాంతో పదే పదే డబ్బులు అడుగుతావా అంటూ కోపంతో ఆయన ఇంటికి అర్థరాత్రి తన మనుషులతో వెళ్లిన బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తినట్లు తెలుస్తుంది. అంతే కాదు డబ్బుకోసం మరోసారి ఇబ్బంది పెడితే అంతు చూస్తానని బెదిరించినట్లు తెలుస్తుంది.  ఈ కారణంతోనే పీవీపీ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో బండ్ల గణేష్ తోపాటుగా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.  ప్రస్తుతం బండ్ల గణేష్ కనిపించకుండా పోయారని..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  గతంలో బాలీవుడ్ నటుడు సచిన్ తో కూడా బండ్లకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవలు జరిగాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: