ప్రస్తుతం పోటీ వాతావరణంలో నిలదొక్కుకోవడానికి నితిన్ ఏకంగా ఒకేసారి మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఒక సినిమాకు ‘భీష్మ’ అన్న టైటిల్ పెడితే మరొక సినిమాకు ‘రంగ్ దే’ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ నేపధ్యంలో నితిన్ నటించబోయే మరొక సినిమాకు ఫిక్స్ చేసిన టైటిల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘చదరంగం’ అన్న టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ కథ అంతా ‘చదరంగం’ ఆట నేపధ్యంలో ఉండటమే కాకుండా ఆ ఆటకు సంబంధించిన రంగంలో ఉండే డార్క్ షేడ్స్ ను ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు ఈ మూవీ కథలో వచ్చే సంఘటనలు నితిన్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు చాల దగ్గరగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ చదరంగం ఆట బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీని కూడ క్రియేట్ చేసినట్లు టాక్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిందని త్వరలో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారని టాక్. 

ఈ మూవీలో నితిన్ పక్కన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ నటిస్తూ ఉంటే ఈ మూవీలో వచ్చే ఒక కీలక ఫ్లాష్ బ్యాక్ కథలో మరొక హీరోయిన్ గా మళయాళ క్రేజీ బ్యూటీ ప్రియ వారియర్ నటిస్తోంది. ప్రస్తుతం నితిన్ సినిమాలకు మార్కెట్ లేకపోయినా ఒకేసారి మూడు సినిమాలను నితిన్ చేస్తూ తన మార్కెట్ ఏమి పడిపోలేదు అన్న సంకేతాలు ఇస్తున్నాడు. ఈ మూడు సినిమా ప్రాజెక్ట్స్ వెనుక నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పరోక్ష సహకారం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు హిట్ అవుతున్న నేపధ్యంలో ఈ చదరంగం నితిన్ కి ఎలాంటి బ్రేక్ ఇవ్వబోతోందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: