తెలుగులో స్టార్ హీరోలలో ఒకరుగా వ్యవహరించిన గోపీచంద్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. తన కామెడీ టైమింగ్ తో తన స్టైల్, యట్టిట్యూడ్ సినిమా రేంజు పెంచుతూ వస్తాడు గోపీచంద్. తెలుగులో చాలా సినిమాలలో నటించాడు హీరోగా నటించిన చిత్రాలు అన్ని హిట్ టాక్ తో దూసుకుపోయాయి. ఇకపోతే ఇతగాడు విలన్ పాత్రల్లో కూడా కనిపించాడు.మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో విలన్ పాత్రలో నటించి ఓ మాదిరిగా ఆకట్టుకున్నాడు. ఇకపోతే రెబల్ స్టార్ నటించిన వర్షం సినిమాలో కూడా విలన్ పాత్రలో కనిపించి మెప్పించాడు.


'గౌతమ్ నంద'  సినిమా తర్వాత ఆ సినిమా తర్వాత చాలా కాలం తర్వాత చాణిక్య చిత్రంలో నటిస్తున్నారు.ఆ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా గురించి గోపీచంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ డైరెక్టర్ చెప్పగానే నేను మాట కూడా మాట్లాడకుండా ఓకే చేసాను. ఈ సినిమాలో కొత్తగా కనిపించాలనుకున్న కానీ, కథ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్ కి నా గడ్డం నచ్చింది. అదే కంటిన్యూ చేద్దామన్నాడు దానికి నేను ఓకే  చేసాను. 


కొత్త జోనర్లో వస్తున్నా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని గోపీచంద్ వెల్లడించారు. ఈ సినిమా అంత మంచిగా రావడానికి ముఖ్య కారణం వెట్రి పళనిస్వామి అయన నన్ను కొత్త లుక్ లో చూపించాలని చాలా ప్రయత్నించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా సంగీతం. సినిమా హిట్ అవ్వాలంటే సాంగ్స్, మ్యూజిక్ తప్పనిసరి ఆ విషయంలో విశాల్ చంద్ర శేఖర్ చాలా బాగా అందించాడు. 



చాణిక్య సినిమా మూడో ఇన్నింగ్స్ విషయానికొస్తే సినిమా కథ చాలా బాగా మొదలైంది. మంచి ఊపుతో స్టార్ట్ అయింది. కొత్త కథనం తో రూపొందిన ఈ సినిమా అందరికి నచ్చేలా ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. గోపీచంద్ సినీ కెరియర్లో ఈ సినిమా మాత్రం ప్రత్యేకమని ముందెన్నడూ లేని విదంగా ఉండబోతుంది. సినిమా చుసిన ప్రతి ఒక్కరు సినిమా బాగుందని అంటారు అని సొంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ సినిమా గోపీచంద్ కు ఏ మాత్రం సక్సెస్ ను తీసుకొస్తుందో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: