టాలీవుడ్ లో ఫ్యామిలీ దర్శకుడు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది తమన్నా. ఈ మూవీలో తమన్నా అందచందాలకు ఫిదా అయిన దర్శక, నిర్మాతలు తర్వాత సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. కానీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తమన్నాకు ఎలాంటి బ్రేకింగ్ రాలేదు. మిల్కీబ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తుంది.
తెలుగు, తమిళంలో మంచి సక్సెస్ సాధించిన తమన్నా ఇటీవల కాలంలో బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతుంది. ప్రభుదేవ దర్శకత్వలో వచ్చిన అభినేత్రి ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ ‘బాహుబలి’ లో
అవంతిక పాత్రలో తమన్నా అప్సరసలా కనిపించింది. ఓ యుద్దనారిగా విజృంభించింది. ఈ మూవీ తర్వాత తమన్నాకు తెలుగు, తమిళంలో మంచి ఛాన్సులు వస్తున్నాయి.
తాజాగా మెగాస్టార్
చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో లక్ష్మీ పాత్రలో నటించింది. తమన్నా నటన హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. తమన్నాకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాత్రకు తమన్న పూర్తి న్యాయం చేసిందని..ఆమె హావభావాలు అద్భుతంగా పలికించిందని అంటున్నారు. ఈ మూవీ తెరకెక్కించే ముందు
లక్ష్మి పాత్ర కోసం దర్శకులు
సురేందర్ రెడ్డి ఎంతో మంది హీరోయిన్లను సంప్రదించారట..కానీ వారంతో తమవల్ల కాదని తప్పుకున్నారట.
ఈ సినిమాలో నయనతారకే పెద్ద పీట వేస్తారు...లక్ష్మి పాత్ర తేలిపోతుందని వారు భావించారట. కానీ సినిమా విడుదలయ్యాక తమన్నాకు వస్తున్న ప్రశంసలతో లక్ష్మీ పాత్ర వదిలేసుకున్న హీరోయిన్లంతా షాకవుతున్నారట. ఒక హిస్టారికల్ మూవీలో ఇలాంటి పాత్ర చేయడం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలని ఇప్పుడు తెగ బాధపడుతున్నారట. బాహుబలి తర్వాత సైరాలో తమన్నా పాత్రకు వస్తున్న క్రేజ్ చూసి ఆ ఛాస్స్ మిస్సయిన హీరోయిన్లు తెగ ఫీల్ అవున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.