వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో గోపీచంద్ నటించిన చాణక్య సినిమా ఈరోజు విడుదలైంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నప్పటికీ గోపీచంద్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ హిట్ కావట్లేదు. కొన్ని రోజుల క్రితం విడుదలైన చాణక్య టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. గోపీచంద్ కు జోడీగా మెహ్రీన్ ఈ సినిమాలో నటించింది. తమిళ దర్శకుడు తిరు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 
 
దర్శకుడు తిరు రొటీన్ కు భిన్నమైన కథను ఎంచుకోవటంతోనే సగం సక్సెస్ అయ్యాడు. స్పై థ్రిల్లర్ అయిన చాణక్య సినిమాను దర్శకుడు పూర్తి స్థాయిలో రక్తి కట్టించాడు. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు అద్భుతంగా ఉన్నాయి. గోపీచంద్ నుండి అతని ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకులను కూడా అలరించే విధంగా తిరు దర్శకత్వం ఉంది. తమిళంలో విజయాలు సాధించిన తిరు తెలుగులో దర్శకత్వం వహించిన తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. 
 
దర్శకుడు తిరు గోపీచంద్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా తెరకెక్కించాడు. కామెడీ, ఆసక్తికరమైన సన్నివేశాలతో తీసిన స్పై థ్రిల్లర్ చాణక్య ప్రేక్షకులను అలరిస్తుంది. గోపీచంద్ ను దృష్టిలో పెట్టుకొని తిరు రాసుకున్న కథ, కథనం అద్భుతంగా ఉన్నాయి. గోపీచంద్ కెరీర్లో చాణక్య సినిమా బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. నిడివి తక్కువగా ఉండటం కూడా సినిమాకు ప్లస్ అయింది. 
 
చాణక్య సినిమాలో గోపీచంద్ లుక్ కూడా కొత్తగా ఉంది. దసరా పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు అందించే అవకాశం ఉంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, శ్రీ చరణ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 12 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఇవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: