తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల హావ బాగా కొనసాగుతుంది. నువ్వా నేనా అని పోటీ పడి మరీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. సినిమాలు కూడా అదే రేంజులో వస్తున్నాయి . ఒకరు ఒక కథతో వస్తే మరొకరు ఇంకొంచం కొత్తగా తెరకెక్కస్తాను అని సినిమాలను కొత్తగా రూపొందిస్తారు. అలా చూసుకుంటే చాలా సినిమాలు వస్తున్నాయి.. నిన్నగాక మొన్న సాహో , సైరా వంటి సినిమాలు వచ్చాయి. 


ప్రస్తుతం గోపిచంద్ నటించిన చాణక్య సినిమా ఈరోజు ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేసింది. కథ పరంగా ఈ సినిమా చాలా బాగుందని టాక్ వినపడుతోంది. గోపిచంద్ యాక్టింగ్ ఈ సినిమాలో కొత్తగా ఉన్నాడని అందరి మాటల్లో వినపడుతోంది.. యాక్షన్ కోణంలో ఇది గోపిచంద్ రెండో సినిమా. 
కొత్త కథతో తెరకెక్కిన ఈ సినిమా అందరును ఆకట్టుకుంది. గౌతమ్ నంద సినిమా లో గోపిచంద్ అనుకున్న హిట్ ని అందుకోలేకపోయాడు.



ఆ సినిమా తర్వాత తెరకెక్కిన ఈ సినిమా హిట్ ఇచ్చిందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోపిచంద్  మాత్రం ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని నమ్మలో ఉన్నాడు చివరికి నమ్మకమే అతన్ని గెలిపించింది.ఏదైనా డబ్బుతో కాదు భయ్యా కంటెంట్ ఉంటె అది హిట్ అవ్వాల్సిందే అని జనాల అంటున్నారు. 



సినిమాలు తెరకెక్కించాలంటే కోట్లు గుమ్మరిస్తే సరిపోదు.. కరెక్టు కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా పక్క హిట్ అవుతుంది అని గోపీచంద్ చాణక్య మరో సారి నిరూపించింది. గతంలో వచ్చిన సాహో , సైరా వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. ఇకపోతే చిన్న తరహా బడ్జెట్లో వచ్చిన గ్యాంగ్ లీడర్ , వాల్మీకి సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు చాణక్య కూడా హిట్ అయింది..


మరింత సమాచారం తెలుసుకోండి: