తొలివలపు సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో గోపీచంద్, తొలి సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకున్నారు. అయితే ఆ తరువాత దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం, నిజం సినిమాల్లో విలన్ గా నటించి మంచి పేరు సంపాదించిన గోపీచంద్, అనంతరం ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాలో కూడా నెగటివ్  పాత్రలో నటించి అలరించారు. అయితే ఆ తరువాత తన పంథా మార్చుకుని పూర్తి స్థాయి హీరోగా అవతారం ఎత్తిన గోపీచంద్, కెరీర్ పరంగా మంచి హిట్స్ తో పాటు కొన్ని ఫ్లాప్స్ ని కూడా చవిచూసారు. ఇక ఇటీవల కొన్నాళ్లుగా ఆయన నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. 

ఆయన నటించిన ఆక్సిజన్, గౌతమ్ నంద, ఆరడుగుల బులెట్, పంతం వంటి సినిమాలు గోపీచంద్ కు నిరాశనే మిగిల్చాయి. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన తాజా సినిమా చాణక్య, నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమాతో వరుస ప్లాపులకు బ్రేక్ వేయాలని భావించిన గోపీచంద్ ఆశలు ఫలించాయనే అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ  సినిమాలో గోపీచంద్ ఒక రా ఇంటెలిజెంట్ ఏజెంట్ గా నటించగా, మెహ్రీన్, సీనియర్ నటుడు నాజర్, బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్, మరొక నటుడు ఖురేషి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ లోని థ్రిల్లింగ్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాపై బాగా అంచనాలు పెంచాయి. 

పాకిస్తాన్ నేపథ్యంలో అండర్ కవర్ ఆపరేషన్ లో పాల్గొనే పవర్ ఫుల్ ఏజెంట్, ఏ విధంగా సమస్యలను ఎదుర్కొని మన దేశాన్ని రక్షించాడు అనే కథాంశంతో తెరకెక్కన ఈ సినిమాను దర్శకుడు తిరు ఎంతో బాగా తెరకెక్కించారని అంటున్నారు. నిజానికి ఈ తరహా స్పై థ్రిల్లర్ చిత్రాలు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా క్లిక్ కాలేదు. ఇక నిన్న తెల్లవారుఝాము సమయంలో పడ్డ షోల నుండి ఈ సినిమాకు మంచి టాక్ రావడం జరిగింది. ఇక సినిమాలో ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సహా అన్ని అంశాలు సమపాళ్లలో కుదిరాయని, మధ్యలో కొద్దిపాటి ల్యాగ్స్ ఉన్నప్పటికీ ఓవర్ ఆల్ గా సినిమా సూపర్ గా ఉందని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: