తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏమైంది ..డబ్బులు బాగా గుప్పించి తెరకెక్కించిన సినిమాలు ఎన్ని వచ్చినా కూడా అవి కేవలం ఒక రోజుకు మాత్రమే పరిమితమయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని విధానంగా జనాలతో మాటలు పడుతున్నాయి.. చిన్న హీరోలు , చిన్న బడ్జెట్లో వచ్చిన సినిమాలన్నీ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇలాగే కొనసాగితే మాత్రం పెద్ద దర్శక నిర్మాతలు మాత్రం మూట ముల్లే సర్దుకోవాల్సిందే అనే టాక్ వినపడుతోంది.. 


ప్రస్తుతం గోపిచంద్ నటించిన చాణక్య సినిమా ఈరోజు ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేసింది. కథ పరంగా ఈ సినిమా చాలా బాగుందని టాక్ వినపడుతోంది. గోపిచంద్ యాక్టింగ్ ఈ సినిమాలో కొత్తగా ఉన్నాడని అందరి మాటల్లో వినపడుతోంది.. యాక్షన్ కోణంలో ఇది గోపిచంద్ రెండో సినిమా. 


సినిమాలు తెరకెక్కించాలంటే కోట్లు గుమ్మరిస్తే సరిపోదు.. కరెక్టు కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా పక్క హిట్ అవుతుంది అని గోపీచంద్ చాణక్య మరో సారి నిరూపించింది. గతంలో వచ్చిన సాహో , సైరా వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. ఇకపోతే చిన్న తరహా బడ్జెట్లో వచ్చిన గ్యాంగ్ లీడర్ , వాల్మీకి సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు చాణక్య కూడా హిట్ అయింది..దీన్ని చిన్న సినిమాలే హిట్ అవుతాయా అనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. 



గోపీచంద్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తాడు ఆ సినిమా లో మొత్తం తన పెరఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు.. సినిమాను చూసిన జనం ఈ సినిమాలో నటులు కనిపించలేదు సినిమా కథ మాత్రమే కనిపించింది.. సినిమా అంటే ఇది భయ్యా అంటూ చాణక్య సినిమాపై ప్రశంశల వర్షం కురిపించారు .. కలెక్షన్స్ ఏ మాత్రం ఉన్నాయో అనే విషయం తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: