టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ గత కొన్నాళ్లుగా కెరీర్ పరంగా వరుస అపజయాలతో సతమతమవుతున్నారు. ఇక ప్రస్తుతం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మాతగా, తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో గోపీచంద్ నటించిన కొత్త సినిమా చాణక్య, నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మెహరీన్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నాజర్, రాజేష్ కత్తర్ సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో నటించారు. 

యాక్షన్ మరియు స్పై థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు తిరు ఎంతో అద్భుతంగా తీశారని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు. తాను అనుకున్న కథను ప్రేక్షకులను అన్నివిధాలా ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు తిరు పూర్తిగా సఫలం అయ్యాడని అంటున్నారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అరాచక శక్తులను, రా స్పై ఏజెంట్ గా పనిచేసే అర్జున్ అనే ఒక బ్యాంకు ఉద్యోగి, ఏ విధంగా మట్టు పెట్టాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం అట. గోపీచంద్ అర్జున్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారని, 

అలానే నటుడు నాజర్ మరియు బాలీవుడ్ నటుడు రాజేష్ కత్తెర్లు కూడా తమ పాత్రలకు ఎంతో న్యాయం చేశారని అంటున్నారు. అలరించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, కామెడీ, ఫైట్ సీన్స్, యాక్షన్ మరియు ఛేజింగ్ సీన్స్ ఎంతో ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఇక హీరోయిన్లు ఇద్దరితో పాటు చిన్న కామెడీ పాత్రల్లో నటించిన ఆలీ మరియు సునీల్ కూడా అలరించారట. ఓవరాల్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ, ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ ఆశలను నెరవేర్చింది అనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంతమేర కలెక్షన్స్ సాధించి ముందుకు సాగుతుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: