ఒక సినిమా హిట్ అవ్వాలంటే ముందు కథ కథనాలు చాలా ఇంపార్టెంట్. కథ, కథనాలను బట్టే ఏ సినిమా ఫలితం అయినా ఆధారపడి ఉంటుంది. కథ.. కథనాలను గాలికి వదిలేసి స్టార్ హీరో, హీరోయిన్లను పెట్టుకుని కోట్లు కుమ్మరించి నేల విడిచి సాము చేస్తే ఫలితం సాహో సినిమా రిజల్ట్ లాగానే ఉంటుంది. సాహో సినిమా కోసం దర్శకుడు సుజిత్ వంటకు కావలసిన అన్ని రకాల దినుసులు బాగానే సిద్ధం చేసుకున్నా అసలైన తాలింపు సరిగా చేయలేక పోయాడు.


దీంతో సాహో సినిమా రు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కినా క‌థ‌నం వీక్‌గా ఉండ‌డంతో డిజాస్టర్ అయ్యింది. ప్రేక్షకులను సీట్ల‌లో నుంచి కదలనీయకుండా చేసే కథనం సినిమాలో మిస్ అయ్యింది. ఇక సైరా విషయానికి వస్తే కాస్త అటు ఇటుగా సాహో స్టైల్ లోనే ఉంది. ఓ చారిత్రక కథనం తెరకెక్కించాలని వచ్చినప్పుడు ఆ కథను వక్రీకరించి కమర్షియల్ చట్రంలో ఇరికించ‌కుండా తెరకెక్కించి ఉంటే సైరా రేంజ్‌ వేరుగా ఉండేది. కానీ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి త‌న‌దైన క‌మ‌ర్షియ‌ల్ స్టైల్లో లాగేశాడు.


అదే గ్యాంగ్‌లీడ‌ర్ మంచి కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. భారీ బ‌డ్జెట్ కాదు.. కోట్లు కుమ్మ‌రించ‌లేదు... స్టార్ కాస్టింగ్ లేదు.. చ‌క్క‌గా క్లీన్ సినిమాగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక వాల్మీకి కూడా సేమ్ అంతే. భారీ బ‌డ్జెట్ కాదు.. వ‌రుణ్ తేజ్‌, పూజ హెగ్డే.. మ‌రో కోలీవుడ్ హీరో ఉన్నారు. హ‌రీష్ శంక‌ర్ కోలీవుడ్‌లో హిట్ అయిన సినిమాను కూడా చ‌క్క‌గా మ‌న నేటివిటికి అనుగుణంగా మార్పులు చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు... హిట్ కొట్టాడు.


ఇక తాజాగా గోపీచంద్ చాణ‌క్య సైతం మంచి క‌థ‌, ఆస‌క్తిక‌ర క‌థ‌నాల‌తో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఓవ‌రాల్‌గా చూస్తే టాలీవుడ్ ప్రేక్ష‌కులు భారీ బ‌డ్జెట్లు, స్టార్ కాస్టింగ్‌ల కంటే క‌థ‌, క‌థ‌నాల్లో దమ్ముంటేనే సినిమాల‌ను ఆద‌రిస్తున్నార‌ని ఈ సినిమాల ఫ‌లితాలే చెప్పేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: