ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండ‌వ కుమారుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇప్పటికే సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ క‌మ‌ర్షియ‌ల్ హీరోగా ఇప్ప‌టికే మంచి పేరు తెచ్చుకున్నారు. బీటెల్‌ప్రొడ‌క్ష‌న్స్ మ‌రియు ల‌క్కీమీడియా బ్యాన‌ర్ పై ప‌వ‌న్‌సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం పూజా కార్య‌క్ర‌మం ఈ రోజు హైద‌రాబాద్ అన్న‌పూర్ణ‌స్టూడియోస్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్ట‌గా యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డేరింగ్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అభిషేక్ నామ సురేష్‌బాబు, జెమినికిర‌ణ్‌, ఎంఎల్‌.ఎ. జీవ‌న్‌రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా  ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో...


వి.వి. వినాయ‌క్ మాట్లాడుతూ... బెల్లంకొండ సురేష్ మొద‌టిసారి న‌న్ను ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు.  ఆ త‌ర్వాత‌ నేను సాయిశ్రీ‌నివాస్‌ను హీరోగా ప‌రిచ‌యం చేశాను. అందుకు చాలా ఆనందంగా అనిపించింది. సాయి లాగా గ‌ణేష్ కూడా మంచి స‌క్సెస్ అందుకోవాల‌ని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి దిల్‌రాజుగారు స‌పోర్ట్ చెయ్య‌డం మంచి ప‌రిణామం. సాయి హీరోగా ఎంత హోం వ‌ర్క్ చేస్తాడో నాకు బాగా తెలుసు అలాగే గ‌ణేష్ కూడా క‌ష్ట‌ప‌డాల‌ని కోరుకుంటున్నాను. అల్లుడు శ్రీ‌ను టైంలో బెల్లంకొండ సురేష్‌గారి మొహంలో చాలా ఆనందాన్ని చూశాను అదేవిధంగా ఇప్పుడు ఆయ‌న మొహంలో ఆనందం చూస్తున్నాను. చిత్ర యూనిట్ అంద‌రికీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... ఈ సినిమాకి ముందుగా అంద‌రూ చాలా మంచి టెక్నీషియ‌న్స్ కుదిరారు. నేనే మా అబ్బాయిని లాంచ్ చేద్దామ‌నుకున్నా కానీ బెక్కం మంచి క‌థ‌తో వ‌చ్చాడు. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ... గ‌త 12 ఏళ్ళ నుంచి సినిమాలు చేస్తున్నాను. ఈ మూవీ నాకు చాలా పెద్ద మూవీ. సురేష్‌గారిని ఆద‌ర్శంగా తీసుకుని నేను ప్రొడ్యూస‌ర్ అయ్యాను. సాయి సినిమాలు చూశాను. గ‌ణేష్‌కి క‌థ చెప్ప‌గానే న‌చ్చి ఒప్పుకున్నాడు. ఈ చిత్రానికి బీటెల్ ప్రొడక్ష‌న్ వాళ్ళ స‌హ‌కారంతో ఇంత త్వ‌ర‌గా ముందుకు వెళ్ళ‌డం జ‌రిగింది. ఈ మూవీని నేను చాలా పెద్ద రెస్పాన్సిబుల్‌గా ఫీల‌య్యాను.  ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాల‌ను అందివ్వ‌డమే నా ధ్యేయం. వివేక్ చాలా మంచి డైలాగ్స్ అందించారు. 


హీరో బెల్లంకొండ గ‌ణేష్ మాట్లాడుతూ...నేను ఈ రోజు ఇక్క‌డ ఉండ‌డానికి ముఖ్య కార‌ణం మా నాన్న‌గారు ఆయ‌న లేక‌పోతే నేను లేన‌ట్లే ఆయ‌న వ‌ల్లే నాకు ఇంత మంచి అవ‌కాశం వ‌చ్చింది. బెక్కం వేణుగోపాల్‌, ప‌వ‌న్ ఇద్ద‌రు క‌లిసి నాకు చెప్పిన క‌థ బాగా న‌చ్చ‌డంతో ఒప్పుకున్నాను. ఈ క‌థ‌లోని ఎమోష‌న్స్‌కి నేను బాగా క‌నెక్ట్ అయ్యాను. కొన్ని సీన్స్ న్యారేట్ చేసేట‌ప్పుడు క‌ళ్ళ‌మ‌ట్ట నీళ్ళు వ‌చ్చాయి. ప్రేక్ష‌కులు కూడా క‌నెక్ట్ అవుతారు న‌న్ను అంద‌రూ ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డ‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. 


ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ మాట్లాడుతూ... నా మీద న‌మ్మ‌కంతో నాకు ఇంత మంచి ప్రాజ‌క్ట్‌ని అందించిన సురేష్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఖ‌చ్చితంగా ఈ సినిమాని నెక్స్‌ట్ లెవ‌ల్‌కి తీసుకువెళ‌తాన‌ని కోరుకుంటున్నాను. సాయిలాగా గ‌ణేష్ కూడా మంచి స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను. 


వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ... ప‌వ‌న్‌గారు చెప్పిన క‌థ నాకు బాగా న‌చ్చి దీనికి డైలాగ్‌లు రాయ‌డానికి ఒప్పుకున్నాను. సాయిశ్రీ‌నివాస్‌లాగానే గ‌ణేష్ కూడా మంచి పేరు తెచ్చుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవ‌కాశం అందించిన సురేష్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.


సాయిశ్రీ‌నివాస్ మాట్లాడుతూ... ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. నా క‌ళ్ళ ముందు పెరిగిన నా త‌మ్ముడు గ‌ణేష్ చిత్రం లాంచ్ అవ్వ‌డం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు గాడ్ అండ్ మై డాడ్ . చాలా యంగ్ టీమ్ ఈ సినిమాకి ప‌నిచేస్తున్నారు. నేను కూడా ఎప్పుడూ యంగ్ టీమ్‌తో ప‌ని చెయ్య‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. నా త‌మ్ముడికి మొద‌టి సినిమాతోనే ఆ అవ‌కాశం దొర‌క‌డం అదృష్టం.  టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్‌డైరెక్ట‌ర్ ర‌థ‌న్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ గాంధీ, డిఒపి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని  త‌దిత‌రులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: