తెలుగులో ట్రెండ్ సెట్టర్ గా చెప్పుకోదగిన ప్రముఖమైన సినిమా ‘శివ’. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతూ తీసిన ఈ సినిమా ఓ సంచలనం. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమాకు నేటితో 30ఏళ్లు పూర్తయ్యాయి. ‘శివ’ తెలుగు సినిమా గమనాన్నే మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. వర్మ టేకింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ టెక్నిక్స్.. తెలుగు సినిమా ప్రస్థానంలో శివకు ముందు ఆ తరువాత అనేలా చేశాయి.

 



శివ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రౌడీయిజం, గూండాయిజంను తాను చూసిన కోణంలో కథగా రాసుకుని సినిమా తీశాడు వర్మ. స్టడీకామ్ కెమెరా టెక్నాలజీని ఈసినిమాలోనే తొలిసారిగా ఉపయోగించారు. సినిమా మొదలైన అరగంటకు విలన్ ఎంట్రీ ఉంటుంది. అప్పటివరకూ భవానీ పేరు మీద విలనిజం హైలైట్ అవుతుంది తప్ప విలన్ కనపడడు. విలన్ ఎంట్రీ కూడా ఎందరో వ్యక్తుల్ని దాటుకుని వెళ్లినట్టు చూపించడం ఆర్జీవి టేకింగ్ స్టైల్. దాదాపు గంటన్నర తర్వాతే హీరో విలన్ ఎదురెదురుపడతారు. అప్పటివరకూ విలన్ వద్ద హీరోను, హీరో గురించి విలన్ కు పక్కవాళ్లు చెప్తూ సినిమాపై క్యూరియాసిటీ, హైప్ పెంచేస్తాడు వర్మ. తెలుగు సినిమాల్లో ఇదో కొత్త స్క్రీన్ ప్లే. స్టూడెంట్ పాలిటిక్స్, సైకిల్ చైన్ ఫైట్, సెకండాఫ్ చీకటిలో ఫైట్ అప్పట్లో ఓ సంచలనం. ‘లైట్స్ ఆర్పెయ్.. చిన్నా రాడ్స్ తియ్ రా’ అనే వర్మ టేకింగ్ స్టైల్ ఓ లెసన్ అనే చెప్పాలి.

 



ఆర్జీవి ఈ సినిమాకు ముందు బి.గోపాల్ వద్ద కలెక్టర్ అబ్బాయి సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా కొద్ది కాలమే పనిచేశాడు. దర్శకత్వంలో అనుభవంలేని వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున తీసుకున్న డేరింగ్ డెసిషన్ కు వర్మ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. నాగార్జున కెరీర్లో శివ టర్నింగ్ పాయింట్ మూవీ. ఈ సినిమాతో నాగ్ స్టార్ హీరోగా మారిపోయాడు. వర్మ లెజండరీ డైరక్టర్ గా మారిపోయాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: