ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎప్పుడైనా కథాకథనాలు ముఖ్యం అన్నది ఇప్పటికే చాలా భాషల్లో సినిమాలు చేసుకున్నాయి. భారీ బడ్జెట్.. కోట్లాది రూపాయలు ఖర్చు... స్టార్ కాస్టింగ్... స్టార్ డైరెక్టర్... స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.... స్టార్ హీరోయిన్... స్టార్ టెక్నీషియన్స్... సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్.... భారీ భారీ సెట్టింగులు ఇవేవీ సినిమాను ఎప్పుడు కాపాడలేవు. కథా... కథనాల్లో ఉన్న దమ్ముతోనే సినిమా ఎప్పుడైనా హిట్ అవుతుంది. ఈ విషయం ఇప్పటికే ఎన్నో సార్లు ఫ్రూవ్‌ అయినా కూడా మన తెలుగు సినిమా మేక‌ర్లు మాత్రం ఈ విష‌యంలో బొక్క బోర్లా పడుతున్నారు.


బాహుబలి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందంటే ఆ సినిమాకు పెట్టిన ఖర్చు మాత్రమే చూడకూడదు. టెక్నీషియన్ల‌ను చూడకూడదు... కథ‌, కథనాలు... రాజమౌళి దర్శకత్వ ప్రతిభ.. కూడా బాహుబలి ఎల్లలు దాటింది. భారతదేశ సినీ చరిత్రలోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా బాహుబలి ప్రపంచ దేశాల్లో సైతం కోట్ల రూపాయిల కలెక్షన్లు కొల్లగొట్టింది. బాహుబలి హిట్ అయింది కదా.. అని కొందరు తెలుగు లో భారీ బడ్జెట్ సినిమాలు తీసేశారు. స్టార్ హీరో ఉన్నాడు కదా అని చెప్పి కథను నమ్మకుండా కోట్లకు కోట్లు కుమ్మరించిన  వాళ్లు తాము నిండా మున‌గ‌డంతో పాటు అందరిని ముంచేశారు. అందుకు ఇటీవల వచ్చిన పెద్ద సినిమాలు ఉదాహరణ.


ఆ త‌ర్వాత వ‌చ్చిన గ్యాంగ్ లీడ‌ర్ కావొచ్చు... వాల్మీకి కావొచ్చు.. తాజాగా రిలీజ్ అయిన చాణ‌క్య సినిమాలు మాత్రం మంచి క‌థ‌, క‌థ‌నాల‌తో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. క‌థ ఎలా ఉన్నా క‌థ‌నం విష‌యంలో ఈ సినిమాల ద‌ర్శ‌కులు తీసుకున్న జాగ్ర‌త్తే ఈ సినిమాల‌ను హిట్ చేసింది. నాని గ్యాంగ్ లీడ‌ర్ క‌థ మ‌రీ కొత్త‌దేం కాదు.. అయినా విక్ర‌మ్ కుమార్ టేకింగ్ సినిమాను హిట్ చేసింది. ఇక వాల్మీకి విష‌యానికి వ‌స్తే కోలీవుడ్ హిట్ మూవీ జిగ‌ర్తండా వ‌చ్చి నాలుగేళ్లు అయ్యింది. అయినా ఆ సినిమాను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చి హిట్ కొట్టారు. ఇక తాజాగా చాణ‌క్య విష‌యంలో సైతం త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు టేకింగ్ సినిమాను నిల‌బెట్టి హిట్ చేసింది. ఏదేమైనా టాలీవుడ్ మేక‌ర్స్ ఇక‌నైనా క‌థ‌, క‌థ‌నాల‌కు ప్ర‌యార్టీ ఇస్తార‌ని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: