సైరా మూవీ విషయంలో మొదట అనుకున్న అంచనాలు తప్పుతున్నాయి. మెగాస్టార్ మూవీ కావడంతో  మొదట ఆ హడావుడి బాగా కనిపించి సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ అంటూ ప్రకటనలు వచ్చాయి. ఇక చిరంజీవి  ఇమేజ్ కూడా తోడు కావడం, టాలీవుడ్ కి ఆయన పెద్ద దిక్కుగా ఉండదంతో మొహమాటంతోనో, అభిమానంతోనో చాలా మంది సైరా అదుర్స్ అనేశారు. కానీ వాస్తవాలు నెమ్మదిగా బయటపడుతున్నాయి. సైరా మూవీ బాహుబలితో పోల్చలేమని తొలిరోజే అంగీకరించిన  సినీ క్రిటిక్స్ ఇపుడు సైరా ఫ్లాప్ కాదు డిజాస్టర్ అని కూడా అనేస్తున్నారు.


ఇదిలా ఉండగా తెలుగులోనే తొలిరోజు వచ్చిన కలెక్షన్లు రెండవరోజు రాబట్టలేకపోయిన సైరాకు ఇపుడు వీకెండ్ దిక్కుగా ఉంది. మొత్తం మీద తెలుగులో బ్రేక్ ఈవెన్ అవుతుందా  అన్న డౌట్ ఉండగా బాలీవుడ్ ఫలితం మాత్రం తేడా కొట్టేసిందని క్లారిటీ వచ్చేసింది. సైరా అక్కడ భారీ డిజాస్టర్ దిశగా పయనిస్తోందని అంటున్నారు. మొదటి రోజే రెండున్నర కోట్లు వచ్చిన ఈ మూవీ రెండవ రోజుకు కోటికి అటు ఇటుగా కలెక్షన్ పడిపోయింది.


ఇక మూడవరోజు కూడా  వరసగా  కలెక్షన్ డ్రాప్ అవుతూనే ఉంది. దీంతో వీకెండ్ ఈ మూవీని కొంచమైనా ఆదుకుంటుందన్న ఆశలు పెద్దగా లేవు. ఇక బాలీవుడ్లో  పాతిక కోట్లు షేర్ రాబట్టాల్సిన ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేసినా మూడవ వంతు అయినా వసూల్ అవుతుందా అన్న బెంగ బయ్యర్లకు పట్టుకుందంటున్నారు. 


అమితాబ్ బచ్చన్ లాంటి వారిని పెట్టుకున్నా, బాహుబలి రేంజి బిల్డప్ ఇచ్చినా, అక్కడ మీడియా పూర్తి అనుకూలంగా రాసినా కూడా ఎందుకో బాలీవుడ్లో మాత్రం సైరా చతికిలపడింది. సాహో ఇక్కడ సూపర్ హిట్ అయి  వంద కోట్లకు పైబడి వసూళ్ళు సాధించింది. అదే సైరా తీసుకుంటే పది కోట్లు అయినా వస్తాయా అన్న డౌట్ పట్టుకుంది.  మొత్తానికి బాలీవుడ్ మెగాస్టార్ కి అచ్చిరాదని మరోమారు రుజువు అవుతోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: