ఆడియెన్స్ ను మెప్పించాలంటే వందల కోట్ల బడ్జెట్ అవసరం లేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. సినిమాకు 200, 300 కోట్ల బడ్జెట్ పెట్టినా అందులో కథ లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి. కంటెంట్ ఉన్న సినిమా కోటి రూపాయల బడ్జెట్ తో వచ్చినా సరే అవి సక్సెస్ అవుతాయి. ఈమధ్య కాలంలో తెలుగు సినిమాల బడ్జెట్ భారీగా పెరిగింది.


వందల కోట్లతో సినిమాలు చేస్తున్నారు.. కాని మరో పక్క యువ హీరోలు మినిమం బడ్జెట్ తో సినిమాలు తీసి హిట్టు కొడుతున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన సాహో, సైరా సినిమాలు రెండు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలే. అయితే ఇవి ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. సాహో కన్నా సైరా కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు.


ఇదిలాఉంటే ఈ సినిమాల్లా భారీ బడ్జెట్ తో కాకుండా ఈమధ్య వచ్చిన గ్యాంగ్ లీడర్, వాల్మీకి, చాణక్య సినిమాలు మంచి ఫలితాలను అందుకున్నాయి. నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా సినిమా వసూళ్లు కూడా అదేలా వచ్చాయి. ఇక గద్దలకొండ గణేష్ అదేనండి వాల్మీకి కూడా 22 కోట్లతో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టింది. ఈరోజు రిలీజైన చాణక్య సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది.


చాణక్య పాజిటివ్ టాక్ సైరాకు షాకే అని చెప్పాలి. మాకు కోట్ల బడ్జెట్ సినిమాలు వద్దు ఇలా మెప్పించే సినిమాలు చాలని అంటున్నారు ప్రేక్షకులు. సినిమా తీసే దర్శకుడు ప్రేక్షకుడిని మెప్పించాలనే ఉద్దేశంతోనే చేస్తాడు. ఇక మీదట సినిమా అంటే బడ్జెట్ పెట్టాలన్న ఆలోచన మాని మంచి కథతో సినిమా చేయాలనుకుంటే బెటర్. ఎందుకంటే వందల కోట్ల బడ్జెట్ పెట్టినా కథలో దమ్ము లేకపోతే మాత్రం ఆడియెన్స్ తిప్పికొడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: