మెగా  హీరోల నుంచి చాలా మంది  హీరోలు టాలీవుడ్ కి  ఎంట్రీ  ఇచ్చారు. కానీ అందరూ హీరోలలో  మెగా  ప్రిన్స్  వరుణ్ తేజ్ ది  ఓ ప్రత్యేకమైన స్టైల్.  కథల ఎంపిక విషయంలో కూడా చాలా భిన్నంగా ఆలోచిస్తారు. అందుకే  భిన్నమైన కథ ఎంచుకుంటూ  దూసుకుపోతున్నారు మెగా  ప్రిన్స్  వరుణ్  తేజ్ . మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు  వచ్చిప్పటికీ తనదైన నటనతో అలరించి ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు వరుణ్ తేజ్ . అయితే స్టార్ హీరోల  రేస్ లో చేరేందుకు వరుణ్ తేజ్ పోటీ పడుతున్నాడు. 

 

 

 

కాగా  ఎప్పుడు భిన్నమైన కథలను ఎంచుకుంటూ  ప్రేక్షకులను అలరించే మెగా  ప్రిన్స్  వరుణ్  తేజ్ ... తాజాగా గజ్జలకొండ గణేష్ అనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.కెలెక్షన్ల  పరంగా కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే గద్దలకొండ గణేష్ కసినిమాలో వరుణ్ తేజ్  నటనకు ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి. ఒక గ్యాంగ్ స్టర్  పాత్రలో నటించిన వరుణ్ నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.  అయితే క్యూట్ గా స్మార్ట్ గా కనిపించే మెగా  ప్రిన్స్  వరుణ్  తేజ్ ... గజ్జలకొండ గణేష్ క సినిమాలో మాత్రం మాసి లుక్ తో  లో ఇరగదీశాడు. 

 

 

 

 

 గద్దలకొండ గణేష్ చిత్రంలో మీసం కట్టు,  భారీ గడ్డంతో ఫుల్ మాస్ లుక్ తో కనిపించి... మాస్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. అయితే తాజాగా వరుణ్ తేజ్ లుక్ కు మార్చాడు. ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ ప్రోవోక్  లైఫ్ కవర్ పేజీపై మెగా ప్రిన్స్ వరుణ్  తేజ్ న్యూ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో అందరికీ తెలియజేసిన వరుణ్ తేజ్...తన ఫోటో ఇంగ్లీష్ మ్యాగజైన్ ప్రోవోక్  లైఫ్ కవర్ పేజీ పై రావటంతో  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రోవోక్  లైఫ్ మ్యాగజైన్  ఈనెల ఎడిషన్ చూడమని తన అభిమానులను కోరారు వరుణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: