అత్యంత భారీ అంచనాలతో విడుదల అయిన ‘సైరా’ ‘వార్’ సినిమాలు కలెక్షన్స్ విషయంలో తెగ ఇబ్బంది పడుతూ ఉంటే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన హాలీవుడ్ మూవీ దేశ వ్యాప్తంగా  వివిధ నగరాలలోని మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కి బాగా నచ్చడంతో ‘సైరా’ వార్ చిత్రాల కలెక్షన్స్ కి జోకర్ చిల్లు పెట్టడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.   వాస్తవానికి ఈ దసరా సెలవుల్లో మల్టీ ప్లెక్సుల నుంచి భారీగా వసూళ్లు కొల్లగొట్టాలని ఆశించిన ‘సైరా’ వార్ చిత్రాల మేకర్స్ కి ఇది ఊహించని  షాక్ అని అంటున్నారు.  

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివిధ నగరాలలో మల్టీప్లెక్స్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాల మధ్య వార్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘సైరా’ ఇప్పటికే మూడు రోజుల్లోనే 150 కోట్ల వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలలో టాక్ తో సంబంధం లేకుండా ‘వార్’ తో హవా కొనసాగుతు ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టినప్పతికీ ఈ రెండు భారీ సినిమాల బయర్లు టెన్షన్ పడుతున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో ఈరెండు సినిమాలకు హాలీవుడ్ మూవీ ‘జోకర్’ మల్టీప్లెక్సుల్లో హవా కొనసాగించడం హాట్ టాపిక్ గా మారింది. దీనితో ఈ రెండు సినిమాల వసూళ్ల పై మెట్రో నగరాల్లో ‘జోకర్’ పెద్ద దెబ్బ కొడుతోంది అని వార్తలు వస్తున్నాయి. ‘జోకర్’ మూవీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో రిలీజ్ కాకపోయినా రిలీజ్ అయిన ప్రతీ చోటా కలెక్షన్స్ విషయంలో దూసుకు పోతోంది. 

భారత్ లో 700 థియేటర్లలో ‘జోకర్’  రిలీజ్ అయింది అని తెలుస్తోంది.   తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ  హక్కులు 16 కోట్లకు  అమ్మకం జరిగినప్పటికీ ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే 20 కోట్లు కొల్లగొట్టింది అని టాక్. చెన్నైలో ‘సైరా’ చిత్రం రెండోరోజు 14లక్షలు వసూలు చేస్తే ‘జోకర్’ చిత్రం ఏకంగా 19 లక్షలు వసూలు చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనితో టాప్ హీరోలు చిరంజీవి హృతిక్ రోషన్ లకు కేవలం ఒక ‘జోకర్’ చెక్ పెట్టిందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: