తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 త్వరలో పూర్తికాబోతుంది.  ఇప్పటి వరకు ఇంటి సభ్యుల మద్య ఎలాంటి వివాదాలు చెలరేగనప్పటికీ..ఎవరి గేమ్ వారు సేఫ్ గా ఆడుతూ వస్తున్నారు.  గత వారం కింగ్ నాగార్జున ఇంటి సభ్యులకు ఒక్కొక్కిరీ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్, రాహూల్, బాబా భాస్కర్, వితిక లను కాస్త గట్టిగానే మందలించారు.  ముఖ్యంగా బాబా భాస్కర్ టాస్క్ లు జరిగే సమయంలో కామెడీ చేయడం మంచి పద్దతి కాదని హితవు చెప్పారు.  దాంతో ఈసారి బాబా భాస్కర్ చాలా సీరియస్ గానే టాస్క్ లు చేస్తున్నారు.

అయితే బిగ్ బాస్ 3 లో మొదటి నుంచి  దూకుడుతో ఆకట్టుకున్న కంటెస్టెంట్ పునర్నవి. మొదట హాట్ హాట్ డ్రెస్సులతో కాక పుట్టించినా.. ఆ తర్వాత క్యూట్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షించింది.  ఇక పునర్నవి-రాహుల్ ఎపిసోడ్ లో లవ్ యాంగిల్ నడుస్తున్నట్లు చూపించారు. అదే సమయంలో వీరిద్దరూ టామ్ అండ్ జర్రీలో తిట్టుకోవడం కూడా నడుస్తుంది.  ప్రస్తుతం పున్నూ పై వ్యతిరేకత ఎక్కువైందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

రాహుల్‌తో సాగుతున్న లవ్ ‌ట్రాక్ కోసమే పునర్నవిని ఇన్నాళ్లు సేవ్ చేస్తూ వచ్చారని.. వాస్తవానికి రమ్యకృష్ణ హోస్టుగా వ్యవహరించిన ఎపిసోడ్‌తోనే పున్ను ఎలిమినేట్ కావాల్సి ఉందని.. కానీ ఆ వారం కావాలనే ఎలిమినేషన్‌ను రద్దు చేశారని తిట్టిపోస్తున్నారు. మరోవైపు వరుణ్, వితిక, రాహుల్‌ గ్రూప్‌‌తో ఉండటం వల్ల ఎక్కువ సేవ్ అవుతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి ఈసారి ఈ ఛాన్సు లేదనిపిస్తుంది.

ఈసారి ఎలిమినేషన్ పునర్నివి కావొచ్చని అంటున్నారు. మరోవైపు మహేష్ విట్టా  ప్రవర్తన కూడా బాగాలేదని ఆయనపై కూడా విమర్శలు వస్తున్నాయి.  మొన్న రాళ్లే రత్నాలు టాస్క్ లో అందరిపై సీరియస్ కావడం..తర్వాత రియలైజ్ అయి అందరినీ బ్రతిమలాడటం చూసి ప్రేక్షకులు ఎందుకు ఇలా చేశాడు అంటూ విమర్శించారు.  ఈ వారం ఇంటి నుంచి ఔట్ అయ్యేది మహేష్, పునర్నవా? ఎవరు వెళ్తారు అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: