సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఆగస్టు 16, 2017 బుధవారం ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.ఈ సినిమా టీజర్ ఆగస్టు 21,2018 న విడుదల అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం  ఎక్కడ చూసినా  సైరా  (సైరా నరసింహారెడ్డి) ఫీవర్‌ సందడి చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఈ బిగ్గెస్ట్‌ మూవీ హిట్‌ టాక్‌తో దూసుకు పోతోంది. ఈ విజయాన్ని చిత్ర యూనిట్‌తోపాటు  సైరా నిర్మాత రామ్‌ చరణ్ భార్య  ఉపాసన కూడా  బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ‍్యంతో తన సంతోషాన్ని ట్విటర్‌ ద్వారా షేర్‌ చేస్తున్నారు. ఆ సినిమా లో హీరోయిన్ గా తమ్మన నటించింది.

తమన్నా భాటియా
 (జ. 1989 డిసెంబరు 21) తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమల్లో నటించే ఓ భారతీయ నటి, మోడల్, నృత్యకారిణి. తమన్నా అని మాత్రమే పిలవబడే ఈమె ముఖ్యంగా తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించింది. తమన్నా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది. మూడూ విఫలమైనా 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్, బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా కళ్ళూరి తమన్నాకి సరైన గుర్తింపును ఇచ్చాయి.

తాజాగా తమన్నాకు తనదైన శైలిలో అభినందనలు తెలిపారు ఉపాసన.అద్భుతంగా నటించి మెప్పించిన తమన్నాకు  ఆమె ప్రత్యేక బహుమతి అందజేశారు. ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. ‘నిర్మాత భార్య నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. నిన్ను మిస్ అవుతున్నాను. త్వరలో కలుద్దాం` అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.

మరోవైపు `సైరా` విజయం మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కొత్త ఊపిరినిచ్చింది. సినిమాలో నర్సింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా అద్భుత నటనతో సైరా లక్ష్మిగా నిలిచిపోనుందంటూ తమన్నాపై ప్రశంసలు కురుస్తున్నాయి.  ముఖ్యంగా `సైరా` అంటూ సాగే పాటలో తమన్నా హావభావాలు అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: