మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా  భారీ అంచనాల నడుమ  వచ్చిన 'సైరా' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.  వర్కింగ్ డేస్ లోనే చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.     ఇప్పటికే ఇండస్ట్రీ  నుంచి సినీ ప్రముఖులంతా 'సైరా' అద్భుతమైన సినిమా.. హృదయాన్ని కరిగించిన సినిమా..  గొప్ప దేశభక్తిని చాటిన సినిమా అని విశేషంగా పొగుడుతున్నారు. ఇక మెగాస్టార్ చిరజీవి నేడు మర్యాదపూర్వకంగా తెలంగాణా నూతన గవర్నర్ తమిళి సాయి సుందరరాజన్ ని కలిశారు. ఆమెను కలిసి దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఐతే ఆమెను చిరు ఎందుకు కలిసినట్లు..?  పైకి మాత్రం తానూ  నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చూడవలసిందిగా ఆమెను కోరటానికి కలిసినట్లు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో.. ? అయితే  సినిమా చూడటానికి  సానుకూలంగా స్పందించిన మహిళా గవర్నర్, త్వరలోనే చూస్తానని చిరుకి మాటిచ్చారట.  గవర్నర్ నరసింహన్ విరమణ అనంతరం ఇటీవలే ఈమె తెలంగాణా గవర్నర్ గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.  ఇక సైరా తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంటూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది. 


మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించగా, నయన తార, తమన్నా,అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలకపాత్రలు చేయడం జరిగింది. ఇక ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందించారు. ఇక చిరు చిన్న విరామం తరువాత, కొరటాల మూవీని స్టార్ట్ చేయనున్నారు. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వస్తున్నాయి.  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో  మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై  రోజులు పాటు సినిమాలోని  కొన్ని కీలక సన్నివేవాలను  షూట్ చేయనున్నారని ఆ రూమర్స్ సారాంశం. కాగా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట.  ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక  ఈ సినిమా  స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోందట. ఇక ఈ సినిమాకి  టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారట. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో మెగాస్టార్  సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని  సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: