బాలీవుడ్ కండల వీరుడు అంటే  వెంటనే గుర్తొచ్చే పేరు కండల కొండ సల్మాన్ ఖాన్.. ఆధర్మ బ్రహ్మచారి అంటే  సల్మాన్ ఖాన్ ఏభైయేళ్ల వయసు దాటినా కూడా ఇంకా పెళ్ళి చేసుకోలేదు. కానీ సినిమాలలో మాత్రం అస్సలు జోరు దగ్గించలేదు. ఎంత సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కూడా అంతే ఎక్కువగా గాసిప్స్ వేయించుకుంటున్నాడు.


సల్మాన్, కత్రినా కైఫ్ కలిసి భారత్ సినిమాలో నటించారు. ఆ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత 2020 కోసం సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే ఇన్షాల్లా అనే సినిమాను ఈద్‌కు సిద్ధం చేశారు. అయితే అనూహ్యంగా ఇన్షాల్లా ఈద్‌కు రాకుండా వాయిదాపడింది.అనుకున్న విదంగా ఈ సినిమా రిలీజ్ కాకుండా పోస్ట్ ఫోన్ అవుతుంది. 


ఇకపోతే ఈ సినిమా లేట్ అవ్వడంతో ప్రభుదేవా దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడనే వార్తలు వినపడుతున్నాయి. ఆ సినిమా పేరు రాధే. ఈ సినిమా ఒక కొరియన్  సినిమాకు రీమేక్ అవుతుంది. అందుకోసం కథను సిద్ధం చేస్తున్నారనే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినపడుతున్నాయని టాక్. 



రంజాన్ పండుగకు వేరే కొత్త సినిమాతో ముందుకొస్తున్న అని సల్మాన్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. దబాంగ్ 3 సినిమాను వీరిద్దరూ కలిసి తెరకెక్కించారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో కత్రినాకైఫ్ గానీ, జాక్వలైన్ ఫెర్నాండేజ్ గానీ నటించే అవకాశం ఉంది. భారత్ సినిమాలో నటించడానికి ప్రియాంక నో చెప్పడంతో సల్మాన్ కోపంగా ఉన్నాడని అర్థమవుతుంది. కొత్త సినిమాలో ప్రియాంక వద్దు.. నాకు కత్రినా కైఫ్ కావాలి అని కండల వీరుడు వెల్లడించారు. ఇక ఎన్నడూ ప్రియాంక చోప్రా తో సల్మాన్ సినిమా చేస్తాడో లేదో తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: