హిందిలో సక్సెస్ అయిన బిగ్ బాస్ షో తెలుగులో మూడవ సీజన్ నడుస్తుంది. ఈ సీజన్ హోస్ట్ గా నాగార్జున మెప్పిస్తున్నారు. ఇంకా షో కేవలం నాలుగు వారాలే ఉండటంతో టాస్కులు చాలా హార్డ్ గా ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 3 అనుకున్నంత రేంజ్ కాకున్నా ఆడియెన్స్ ను అలరించడంలో కొద్దిగా సక్సెస్ అయ్యింది.


రిలీజ్ అవుతున్న సినిమాలకు బిగ్ బాస్ తో ప్రమోట్ చేయడం కామన్. ఈ సీజన్ లో కూడా కొన్ని సినిమాలు బిగ్ బాస్ సీజన్ లో ప్రమోషన్స్ చేశాయి. అయితే సైరా టీం కూడా బిగ్ బాస్ ద్వారా ప్రమోట్ చేస్తారని అనుకున్నారు కాని సైరా టీం మాత్రం తెలుగు బిగ్ బాస్ ను లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది.


అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు బిగ్ బాస్ లో కాకుండా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షోలో పాల్గొంటారని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎలాగైనా చూస్తారనే నమ్మకమో లేక హింది కలక్షన్స్ బాగా రావాలన్న ఉద్దేశమో కాని సైరా సినిమా తెలుగు బిగ్ బాస్ షోని లైట్ తీసుకున్నారని తెలుస్తుంది.


హోస్ట్ గా నాగార్జుననే కాబట్టి చిరంజీవిని కన్విన్స్ చేసి రప్పించగలడు కాని నాగార్జున కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది. సైరా యూనిట్ తెలుగు బిగ్ బాస్ కు వస్తే తప్పకుండా షోకి అటు సినిమాకు హెల్ప్ అవుతాయి. నిర్మాత రాం చరణ్.. హీరో చిరంజీవి ఇద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ తెలుగులో కనిపించి అలరిస్తే బుల్లితెర మెగా ఫ్యాన్స్ కూడా సంబరపడిపోతారు.  శనివారం ప్రోమోలో నాగార్జున సర్ ప్రైజ్ ఏమి లేదు వచ్కే వారమైనా సైరా టీం వస్తుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: