లో ఎంతో పాపులారిటీ సంపాదించిన రియాల్టీ షో ‘బిగ్ బాస్’.  హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ గా మొదలైన ఈ షో తర్వాత బిగ్ బాస్ గా ప్రపంచ వ్యాప్తంగా వస్తుంది.  భారత దేశంలో మొదట బిగ్ బాస్ షో కి హూస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరించారు.  ప్రస్తుతం బాలీవుడ్ లో బిగ్ బాస్ 13 సీజన్ నడుస్తుంది.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీ నాలుగు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. తెలుగు, మళియాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ తెరకెక్కించారు.  


ఈ మూవీ కొన్ని చోట్ల టాక్ మంచిగా వచ్చినా..కొన్ని చోట్ల ఫ్లాప్ టాక్ వచ్చింది.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నారు.  అయితే ఆయన సందడి చేసేది తెలుగు బిగ్ బాస్ లో కాదండోయ్..బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నిర్వహించే బిగ్ బాస్ సీజన్ 13 లో 'సైరా' టీమ్ కనిపిస్తారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 


కాకపోతే బాలీవుడ్ లో మాత్రం ఆశించిన స్థాయిలో సినిమా కలెక్షన్స్ లేవు. దాంతో అక్కడ కాస్త గట్టిగానే ప్రమోషన్ చేసే పనిలో ఉన్నాడు నిర్మాత రాంచరణ్. రాంచరణ్.. సల్మాన్ సినిమాల తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పడమే కాదు.. సల్మాన్ ట్రైలర్లను కుడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తుంటాడు. అ నేపథ్యంలో సల్మాన్ కు ఇంత క్లోజ్ గా ఉండే చిరు, చరణ్ లు బిగ్ బాస్ షో కి హాజరైతే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: