నిర్మాత మరియు కమెడియన్ బండ్ల గణేష్, అతని అనుచరులపై హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో  కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి పీవీపీ ఇంటికి వెళ్లి.. బండ్ల గణేష్, మరియు అతని అనుచరులు దాడికి ఇంకా బెదిరింపులకి పాల్పడ్డారు. దీంతో.. బండ్ల గణేష్ తో పాటు మరో నలుగురిపై "ఐపీసీ 448, 506" కింద పీవీపీ
కేసులు బుక్‌ చేయించారు.


వివరాల్లోకి వెళితే:- టెంపర్ సినిమా కోసం పీవీపీ నుంచి రూ.7 కోట్లు.. బండ్ల గణేష్  ఫైనాన్స్ కింద తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సినిమా విడుదల సమయంలో బండ్ల గణేష్ అసలు మొత్తాన్ని పీవీపీ కి చెల్లించి మరికొంత మొత్తానికి గానూ చెక్కులను ఇచ్చారు. కాగా.. మిగిలిన అమౌంట్‌ ఇంకా రాకపోవడంతో.. గతరాత్రి బండ్ల గణేష్‌కు ఫోన్ చేసి పీవీపీ డబ్బులు అడిగారు. దీంతో.! ఆగ్రహానికి లోనైన బండ్ల గణేష్.. మరియు అతనికి సంబంధించిన కొంతమంది మనుషులు కలిసి డబ్బులు అడుగుతావా అంటూ.. పీవీపీ ఇంటికి వెళ్లి అతన్ని బెదిరించారని తెలుస్తోంది. 


ఈ నేపథ్యంలో నిర్మాత పొట్లూరి వరప్రసాద్... శుక్రవారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. దీంతో  జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్లో గణేశ్‌తో పాటు అతని అనుచరులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.వెంటనే అప్రమత్తమైన బండ్ల గణేష్ పరారీలో వున్నట్లు తెలుస్తుంది. "సినిమాలో లా రౌడీయిజం నిజజీవితంలో చెల్లవని... అధికారుల ఉక్కుపాదం ఎప్పుడు చెడుపై ఉంటుందని... గుర్తుచేసే దిశగా.. మన పోలీస్ శాఖ వారు బండ్ల గణేష్ కు 6నెలల జైలు శిక్ష విధించారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


ఏదీ ఏమైనప్పటికిని మళ్ళి "సరిలేరూ నికెవ్వరు" సినిమాతో నటనని మొదలు పెట్టిన బండ్ల గణేష్ ఇలా పరారీలో వుంటే ఆ సినిమా దర్శకులు, నిర్మాతల పరిస్థితిని విడుదల కె వదిలేయాలి మరి...!!!


మరింత సమాచారం తెలుసుకోండి: