బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. మరో మూడు నాలుగు వారాల్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలుస్తుంది. సీజన్ 1, 2 ల కన్నా ప్రశాంతంగా జరిగిన సీజన్ ఇదే అని చెప్పొచ్చు. అయితే ఈ సీజన్ ఇంకా జరగాల్సింది చాలా ఉందని ప్రస్తుతం టాస్కులను బట్టి చూస్తే అర్ధమవుతుంది. సీజన్ ఎండింగ్ కు వస్తున్నా కొద్ది టఫ్ టాస్కులు వస్తున్నాయి.


ఈ వీక్ మొత్తం టాస్కులతో షోని నడిపించిన బిగ్ బాస్ ఆట రసవత్తరంగా సాగేలా చూశాడు. అయితే షోలో వైల్డ్ కార్డ్ గా వచ్చిన అలి రెజా మాత్రం తమ గేమ్ ప్లాన్ మొత్తం మార్చేశాడు. మొదటి నుండి టఫ్ కంటెస్టంట్ గా ఉన్న అలి రెజా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లాడు. 3 వారాలు బయట ఉండి వచ్చాడు.  


అయితే ఆట మొత్తం ఎవరి సైడ్ ఉంది.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకున్న అలి రెజా వైల్డ్ కార్డ్ గా ఇంట్లోకి వెళ్లాక ఇదవరకు ఆడినంత ఫోకస్ గా ఆడటం కనిపించట్లేదు. టైటిల్ తనకు రాదని డిసైడ్ అయ్యాడు కాబట్టి తన సోదరి శివ జ్యోతిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నాడు అలి రెజా. ఈ వారం జరిగిన టాస్కుల్లో ఆమె కోసం అలి చాలా సాక్రిఫైజ్ చేశాడు.  


శివ జ్యోతి గెలవాలంటే వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్ ఇలా అందరిని దాటి వెళ్లాలి. అది అంత ఈజీగా జరిగే పని కాదు. టాస్కుల్లో కిందబడి మీద పడి తన 100 పర్సెంట్ ఎఫర్ట్ పెడుతుంది వితిక. ఆమెను సరిగా హ్యాండిల్ చేయకుంటే ఎక్కడ వరుణ్ సందేష్ వచ్చి గొడవ పడతాడని భయం ఇంటి సభ్యులలో ఉంది. అందుకే వితికని వదిలేస్తున్నారు. ఆమె టాస్కులు గెలుస్తూ ఉంది. మరి అలి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యి శివ జ్యోతికి ప్లస్ అవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: