భారీ అంచనాల నడుమ  విడుదలైన 'సైరా' చిత్రం అనుకున్నట్టే వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.  ముఖ్యంగా నైజాం బాక్స్ ఆఫీస్ ముందు మెగాస్టార్ క్రేజ్ ఏపాటిదో సాధించిన భారీ కలెక్షన్స్ తో  ఋజువైంది.  ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు 'సైరా' నైజాం మొదటిరోజు కలెక్షన్స్ అల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.   కాగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది.  రేపటి నుండి మళ్లీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.  ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సైరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.  ఇక ఈ చిత్రానికి ఏపీ & తెలంగాణలో  3వ రోజున  వచ్చిన మొత్తం కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.. 

నైజాం -    2.55   కోట్లు 

వైజాగ్  -   1.12   కోట్లు    

సీడెడ్  -      1.35   కోట్లు 

తూర్పు గోదావరి  -     0.43   కోట్లు

పశ్చిమ గోదావరి  -      0.27  కోట్లు

  గుంటూరు  -    46.20  లక్షలు 

కృష్ణా      -     49.60   లక్షలు 

నెల్లూరు -   24.60  లక్షలు 

ఏపీ & తెలంగాణలో  3వ రోజున  వచ్చిన కలెక్షన్స్  మొత్తం   6.93 కోట్లు   

ప్రపంచ వ్యాప్తంగా సైరా 3 రోజుల కలెక్షన్ల వివరాలు : 

ఏపీ & తెలంగాణ  55.82 కోట్లు 

కర్ణాటక & రెస్ట్ అఫ్ ఇండియా-  4.02   కోట్లు

యూఎస్ఏ -  3.85  కోట్లు

కర్ణాటక           8.22 కోట్లు 

తమిళ్           1.04  కోట్లు 

కేరళ              0.51 కోట్లు 

ఆర్ఓఐ          3.10 కోట్లు 

యుఎస్ఏ       5.52  కోట్లు  ఆర్ఓడబ్ల్యూ    2.95  కోట్లు  

మొత్తం 3 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా   77.16   కోట్ల  షేర్ ను రాబట్టింది. 


కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్  మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు.  అలాగే  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటించారు.   అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: