సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాం చరణ్ నిర్మాతగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన సైరా భారీ అంచనాలతో అక్టోబర్ 2న విడుదలై సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. అందుకే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సైరా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఇక చిరు చిన్న విరామం తరువాత, కొరటాల తో కలిసి సెట్స్ పైకి వెళ్ళబోతున్నారు. ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోందట. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారట. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు లేటెస్ట్ న్యూస్.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని తాజా సమాచారం. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమాలో చిరు కి జోడీగా కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంబినేషన్ మళ్ళీ రిపీటవబోతోందట. ఇక కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో ఉన్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. గతంలోను కొరటాల ఇలాంటి సోషల్ మెసేజ్ తోనే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. దాంతో చిరు-కొరటాల కాంబో మీద భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగితమందించబోతున్నాడని తెలుస్తోంది.

దేవీ శ్రీ ప్రసాద్ మెగాస్టార్ కి శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ని అందించాడు. మెగాస్టార్ తో అద్భుతంగా స్టెప్స్ వేసే హుషారైన ట్యూన్స్ ఇచ్చాడు. ఇక చిరు రీ-ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 కి కూడా మాంచి మాస్ సాంగ్స్ ఇచ్చి 60 లో కూడా యంగ్ హీరోస్ కి ఏమాత్రం తగ్గకుండా చిరు డాన్స్ తో అదరగొట్టారు. ఇక కొరటాల శివ కి దేవీ శ్రీ ప్రసాద్ కి మంచి ట్యూనింగ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వచ్చి మ్యూజికల్ గా మంచి హిట్ ని అందుకోవడమే కాదు ఈ సినిమాలన్నిటికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. అందుకే మెగాస్టార్ తో కొరటాల తెరకెక్కించబోతున్న చిరు 152 వ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీని ఎంపిక చేసుకున్నారు కొరటాల అని తెలుస్తొంది . అదే గనక నిజమైతే మెగాస్టార్ మళ్ళీ దేవీ మ్యూజిక్ అద్భుతమైన స్టెప్స్ వేయడం ఖాయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: