మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి ఇటీవల గాంధీ జయంతి కానుకగా రిలీజ్ అయి ఒకింత యావరేజ్ టాక్ ని సంపాదించుకుని పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. రేనాడు ప్రాంతానికి చెందిన తొలి తరం స్వాతంత్రోద్యమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కథా రచన పరుచూరి బ్రదర్స్ చేయగా, మాటలను సాయి మాధవ్ బుర్రా, కెమెరా మ్యాన్ గా రత్నవేలు, సంగీత దర్శకుడుగా అమిత్ త్రివేది వ్యవహరించడం జరిగింది. సినిమాలో మెగాస్టార్ నటన, నేపధ్య సంగీతం, భారీ విజువల్స్, సెట్టింగ్స్, 

సాంగ్స్ వంటివి బాగున్నప్పటికీ, కథ మరియు కథనాలను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించలేకపోయారనే వాదనను మెజారిటీ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ ను సినిమాకు కథా వస్తువుగా ఎంచుకున్నప్పటికీ, దానిని ప్రేక్షకుడికి చేరువ చేసేలా మాత్రం దర్శకుడు తీయలేదని వారు అంటున్నారు. అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చ సుదీప్, రవి కిషన్ వంటి పలు ఇతర భాషల దిగ్గజ నటులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మెగాస్టార్ వీరోచిత నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఇక హీరోయిన్ నయనతార, తమన్నా సహా ఇతర నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారని, అయితే మధ్యలో అక్కడక్కడా సినిమాలో కొన్ని ల్యాగ్స్ ఉండడం, 

అలానే అత్యధిక రన్ టైం వంటివి ఈ సినిమాకు ప్రతిబంధకాలుగా మారాయంటున్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా రన్ టైం ను కొంతమేర తగ్గించేలా సైరా యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తక్కువస్థాయిలో ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుండడంతో, సినిమాలోని అవసరం లేని రెండు, మూడు సీన్స్ ను తొలిగిస్తారని అంటున్నారు. అయితే దీనిపై ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియలాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: