టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తొలుత కమెడియన్ గా ప్రవేశించిన బండ్ల గణేష్, మెల్లగా ఒక్కో సినిమా చేస్తూ, తన ఆకట్టుకునే కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఆ తరువాత కొద్దిరోజులకు నిర్మాతగా మారిన బండ్ల గణేష్, తొలిసారి మాస్ మహారాజ రవితేజ హీరోగా తన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆంజనేయులు అనే సినిమాను నిర్మించడం జరిగింది. అయితే నిర్మాతగా చేసిన తొలిప్రయత్నమే గణేష్ కు పెద్ద షాక్ ని ఇచ్చింది, అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆంజనేయులు సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ తరువాత పవన్ తో తీన్ మార్ తీసినా, అది కూడా హిట్ కాలేదు, అయితే కొంత కాలం తరువాత మళ్ళి పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ తీసి సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు బండ్ల. 

ఆ తరువాత పలు బడా సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్, కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే మొన్నటి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోతుందని, అలానే కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని, అలా జరగకపోతే తన గొంతును బ్లేడ్ తో కోసుకుంటాను అనడం, ఆ తరువాత కాంగ్రెస్ ఓటమి పాలవడంతో గణేష్ ను మీడియా వారు గొంతు కోసుకోమని ఆయన ఇంటికి చేరడం వంటి ఘటనలు జరిగాయి. ఇక అంతటితో రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టిన బండ్ల, ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా టాలీవుడ్ కి మరొక్కసారి కమెడియన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇకపోతే గతంలో కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ తో ఆయన నిర్మించిన టెంపర్ సినిమా విషయమై మరొక బడా నిర్మాత పివిపి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్న బండ్ల గణేష్, అప్పటినుండి ఇపటివరకు ఆ అప్పను తీర్చకపోవడంతో, కొద్దిరోజుల క్రితం బండ్లను పివిపి కలిసి డబ్బులు ఇవ్వమని అడిగారట, 

అయితే నేను ఇవ్వను అని చెప్పిన బండ్ల గణేష్, నిన్న రాత్రి తన అనుచరులతో కలిసి తమ కుటుంబసభ్యులను పలు విధాలుగా ఇబ్బంది పెట్టి భయబ్రాంతులకు గురి చేసినట్లు, పివిపి నేటి ఉదయం జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో బండ్ల గణేష్ పై కంప్లైంట్ ఇచ్చారు. అయితే, పివిపి కంప్లైంట్ ని స్వీకరించిన పోలీసులు బండ్లను అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లగా, ఇంట్లో ఆయన అందుబాటులేరని సమాచారం. అయితే ఈ విషయమై నిన్న రాత్రే తాను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పివిపి పై కంప్లైంట్ ఇచ్చినట్లు తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేసారు బండ్ల. పివిపి నుండి తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని బండ్ల తన రిపోర్ట్ లో తెలిపారట. అంతటితో ఆగకుండా పివిపి పై పలు విధాలుగా పరోక్షంగా ట్వీట్స్ చేస్తూ తిట్ల వర్షం కురిపించారు బండ్ల. కాగా నేడు ఈ వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: