కల్యాణి ప్రియదర్శన్‌ పేరు తలుచుకోగానే ముందు గుర్తుకువచ్చేది అందమైన,అమాయకమైన రూపం.ఈమెను చూసిన వారు ఓ మగువా నీ అందం వర్ణాతీతం,నేను రవివర్మని అయినా కాక పోతిని,నీ అందాన్ని బొమ్మలా మలిచే భాగ్యం దక్కునేమో,ఆ చల్లని వెన్నెల కాంతినైన కాకపోతిని నీమేను తాకి మురిపోవడానికి అని కవితలు ధారళంగా కురిపిస్తా రు.ఇక ఈ హాలో హీరోయిన్ ఓ స్టార్ హీరో కొడుకుతో ప్రేమలో ఉందట..


ఇక ఇప్పటికే టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో ఉన్న సమంత నాగచైతన్యతో ప్రేమలో పడటం,ఆ తరువాత అతడిని పెళ్లి చేసుకుని సమంత అక్కినేనిగా మారడం వెంట వెంటనే జరిగాయి.ప్రస్తుతం ఈ అక్కినేని కోడలు ఇటు కెరీర్,అటు ఫ్యామిలీ రెండింటిని విజయవంతంగా మెయిన్‌టెన్ చేస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత బాటలోనే అఖిల్ బ్యూటీ కూడా వెళుతోందట.హలో మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టీ కల్యాణి ప్రియదర్శన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.


మలయాళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు,హీరో ప్రణవ్ లాల్‌తో కల్యాణి పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు టాక్.ఇక ఈ కేరళ కుట్టీ,మలయాళి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్,నటి లిజీల కూతురు.ఇకపోతే ప్రియదర్శన్, మోహన్ లాల్ కలిసి ఏకంగా 43 సినిమాలు తీశారు.అంతే కాకుండా వీరిద్దరు చదువుకున్న రోజుల నుంచే స్నేహితులు కావడం వల్ల ఈ రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉండటంతో ప్రణవ్,కల్యాణి ప్రేమలో పడ్డారు.ఈ విషయం కూడా ఇంట్లోవాళ్లకు తెలుసని ఇక తన ప్రేమ విషయంలో ఎలాంటి అడ్డంకులుండవని అందుకే అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది.


ఇదివరకు వీరి ప్రేమపై  కూడా చాలా సార్లు వార్తలు పుట్టుకొచ్చాయి.ఈ మధ్యనే ఈ ఇద్దరు తమ సినీ కెరీర్‌ను ప్రారంభించగా.. కెరీర్‌లో కాస్త సెటిల్ అయిన తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటు ఉన్నారట ,మరి ఇప్పుడొచ్చిన వార్తల్లో ఎంత నిజముందో తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.ఇక ఈ వార్త విన్న అభిమానులు మొత్తానికి ఈ జంట ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుందా చర్చించుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: