మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల  ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా రూపొందిన సైరా నరసింహారెడ్డి సినిమా ఇటీవల గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను సంపాదించిన విషయం తెలిసిందే. అయితే మంచి హైప్ తో రిలీజ్ అయి, తొలి రోజు భారీగా ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా, తరువాతి రోజు నుండి అత్యల్ప స్థాయిలో మాత్రమే కలెక్షన్లు రాబడుతూ ముందుకు సాగుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

అయితే ప్రస్తుతం దసరా సెలవులు మరియు వీకెండ్ కావడంతో ఈ కొద్ది రోజుల పాటు సైరా ఇంకొంచెం బెటర్ గా కలెక్షన్స్ రాబట్టవచ్చని, అయితే పండగ తర్వాత మాత్రం చాలా వరకు కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ యాక్షన్ థ్రిల్లర్ చాణక్య సినిమా మంచి హిట్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకుపోతోంది. ఏ, బి, సి అనే తేడా లేకుండా అన్ని క్లాసులు ఆడియన్స్ నుంచి మంచి టాక్ సంపాదించిన ఈ సినిమా, ఒకరకంగా సైరానరసింహారెడ్డి కలెక్షన్లకు గండి కొట్టే అవకాశాలు చాలావరకు ఉన్నాయంటున్నారు. 

తొలి రోజే మంచి హిట్ టాక్ ని సంపాదించిన చాణక్య సినిమా ప్రభావంతో, రేపటి నుండి సైరాకు దెబ్బ పడే అవకాశం ఉందని కొంతవరకు తెలుస్తోంది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక వరుస పరాజయాలతో సతమతమవుతున్న యాక్షన్ స్టార్ గోపీచంద్ కు ఈ సినిమా సక్సెస్ మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో చాణక్య ఎంత మేర కలెక్షన్లు రాబట్టి ముందుకు దూసుకెళ్తాడో, దాని ప్రభావం ఎంతవరకు సైరా పై ఉంటుందో తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు ఓపికపట్టాల్సిందే. అసలే యావరేజ్ టాక్ తో మెల్లగా ముందుకు సాగుతున్న సైరాకు, చాణక్య రూపంలో కొంత ముప్పు ఎదురవ్వడం కొంత ఇబ్బందికరమేనని, అయితే చాణక్యను ఎంతమేర సైరా ఎదుర్కొని ముందుకు సాగుతుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: