రీమేక్ ల వీరుడుగా ప్రభుదేవా ఎప్పుడో పేరు తెచ్చుకున్నారు. తెలివిగా దక్షిణాదిన సక్సెస్ అయిన సినిమాలన్నింటినీ తీసుకుని బాలీవుడ్ లో కాస్త జాగ్రత్తగా సినిమాలు చేసి సక్సెస్ సాధిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఆ లిస్టులో వీడొక్కడే చేరనుంది. ఈ సినిమాను దక్షిణాదిన ఏవీయం సంస్థ నిర్మించింది. ఈ సినిమా హక్కులను టిప్స్ కు హిందీ కోసం రూ.1.5కోట్లకు విక్రయించింది. ఇప్పుడు టిప్స్ ఈ సినిమాను హిందీలో తెరకెక్కించడానికి ప్రభుదేవాను అడిగింది. ప్రభుదేవా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే సమాచారం. అదే నిజమైతే ఇక నటీనటుల్ని ప్రకటించడమే తరువాయి. మరి ఈ హిందీ చిత్రంలో తమన్నకు ఛాన్స్ ఉంటుందా? వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: