టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య నాలుగు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా, ఒకింత మిశ్రమ స్పందనను దక్కించుకుని, మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల ఆశలపై కూడా నీళ్లు చల్లింది అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి తన అత్యద్భుతమైన నటనతో సినిమాను ముందుకు నడిపినప్పటికీ, ఒకింత చప్పగా సాగె ఫస్ట్ హాఫ్ తో పాటు, మధ్యలో అక్కడక్కడా వచ్చే ల్యాగ్స్ వంటివి థియేటర్లో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టగా, బోలెడంత ఉన్న రన్ టైం ఎక్కువమందిని కొంత ఇబ్బందిపెడుతుందట. ఇకపోతే తొలిరోజు బాగానే ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా, మలి రోజు నుండి మెల్లగా తన దూకుడును తగ్గిస్తూ నత్తనడకన ముందుకు సాగుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

తొలివారం టిక్కెట్ల ధరలు భారీగా రెండింతలు ఉండడంతో కొందరు ఈ సినిమా చూసేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. ఇక సినిమాలోని కథ, కథనాలు బలంగా ఉన్నప్పటికీ, అవి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా వరకు ఫెయిల్ అయినట్లు చెప్తున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్, ప్రీ ఇంటర్వెల్ భారీ యుద్ధ సన్నివేశం, అదిరిపోయే విజువల్స్, అబ్బురపరిచే సెట్స్ వంటివి బాగున్నాయని, ఇక అమితాబ్ వంటి మరికొందరు ఇతర భాషల నటులు సినిమాలో ఉన్నప్పటికీ వారివి ప్రత్యేక పాత్రల మాదిరిగా ఉండడంతో, వారి ఇంపాక్ట్ సినిమాకు పెద్దగా ఉపయోగపడదని అంటున్నారు. ఇకపోతే ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమాను అత్యంత భారీ వ్యయంతో యువి క్రియేషన్స్ వారు నిర్మించిన సంగతి తెలిసిందే. 
ఆ సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సాహో కూడా తొలి రోజు తొలి ఆట నుండి, ప్రేక్షకుడి నుండి వ్యతిరేకతను ఎదుర్కొని, ఓవర్ ఆల్ గా క్లోసింగ్ సమయానికి పర్వాలేదనిపించింది. అయితే అప్పటినుండి

ఇప్పటివరకు సుజీత్ కు మరొక సినిమా అవకాశం రాలేదని, ఇక ప్రస్తుతం సైరా సినిమాను కూడా సరిగ్గా తీయలేకపోయిన సురేందర్ రెడ్డి పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో అదే అంటూ ఒక వాదనను కొందరు టాలీవుడ్ వర్గాల వారు తెరలేపుతున్నారు. అయితే సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా నితిన్ తో ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ, దానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ విధంగా సురేందర్ రెడ్డి కూడా సాహో సుజిత్ మాదిరి కొంత గడ్డు పరిస్థితిని రాబోయే రోజుల్లో ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: