మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా ప్రస్తుతం ధియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాకు డైరక్ట్ చేసిన సురేందర్ రెడ్డి తన టేకింగ్ తో మెగా అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇంత భారీ ప్రాజెక్టుకు సురేందర్ రెడ్డి దర్శకుడంటే మొదట్లో అందరూ పెదవి విరిచారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ తాను హ్యాండిల్ చేస్తే ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ట్రైలర్ తోనే చెప్పేశాడు. సినిమా విడుదలయ్యాక సురేందర్ రెడ్డి పర్ఫెక్షన్ ను అందరూ మెచ్చుకుంటున్నారు.

 


కెరీర్ లో సక్సెస్, ఫెయిల్యూర్స్ సమానంగా ఉన్న సురేందర్ రెడ్డి మెగా ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చినట్టే కనిపిస్తోంది. 2014లో బన్నీతో తీసిన రేసుగుర్రం సూపర్ హిట్ అయింది. 2016లో రామ్ చరణ్ తో తీసిన ధృవ హిట్ అయింది. ఇప్పుడు మెగాస్టార్ తో తీసిన సైరా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చిరంజీవిలోని నటుడిని బయటకు తీసి సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఇంత భారీ ప్రాజెక్ట్ ను, క్యాస్టింగ్ ను సమర్ధవంతంగా హ్యాండిల్ చేశాడని పేరు తెచ్చుకున్నాడు. సాధారణంగా చిరంజీవికి ఓ దర్శకుడి పనితనం నచ్చితే వదిలిపెట్టరు. మెగా కాంపౌండ్ లోనే మూడు హిట్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డి మెగా ఫ్యామిలీకి కావలిసిన మనిషి అయినట్టే. అల్లుడా మజాకా సినిమా సమయంలో ఈవీవీ పనితీరు నచ్చిన చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ ను ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చాడు. ఠాగూర్ విజయాన్నిచ్చిన వినాయక్ సంగతి చెప్పక్కరలేదు.

 


సైరాతో సురేందర్ రెడ్డి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడనడంలో సందేహం లేదు. ఇక మెగా కాంపౌండ్ డైరక్టర్ గా ముద్ర పడితే కూడా దర్శకుడిగా మంచి అవకాశం దక్కినట్టే. ఎందుకంటే మెగా కుటుంబంలోనే దాదాపు ఏడుగురు వరకూ హీరోలున్నారు మరి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: