రానా ఆరోగ్యం పై ఎన్నో వార్తలు ఇప్పటికే వచ్చినప్పటికీ ఆ వార్తలలోని ఒక్క విషయం పై కూడ రానా కుటుంబ సభ్యులు స్పష్టంగా స్పందించలేదు. కేవలం రానా అమెరికాలో ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రమే అంగీకరిస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితులలో రానా రెండు రోజుల క్రితం తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా తాను కారులో కూర్చుని ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ మరో రెండు రోజులలో తాను ఇండియా రాబోతున్నట్లు మెసేజ్ పెట్టాడు.

దీనితో రానా హైదరాబాద్ వచ్చేస్తున్నాడు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక రానా హైదరాబాద్ రావడం గురించి ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. ఆ పత్రిక కథనం ప్రకారం రానాను హైదరాబాద్ రాకుండా దగ్గుబాటి కుటుంబం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఆ
కథనంలో పేర్కొంది. 

రానాను ముంబాయ్ లో మరి కొన్ని రోజులు తమ కుటుంబానికి చెందినకొందరి వ్యక్తుల పర్యవేక్షణలో రానాను ముంబాయ్ లోని ఒక ఇంటిలో మీడియాకు దూరంగా ఉంచుతారట. దీనికిగల కారణాలు తెలియనప్పటికీ వెంటనే రానా హైదరాబాద్ రాకుండా ఈ వ్యూహాలు రానా కుటుంబ సభ్యులు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనితో రానా బాగా సన్నపడి నీరసంగా ఉన్నాడు అన్న విషయం అందరికీ తెలియకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా లేదంటే అమెరికాలోని డాక్టర్స్ సలహా ప్రకారం రానాను మరికొన్ని రోజులపాటు జనానికి దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న విషయమై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దేనితో రానా హైదరాబాద్ వచ్చి మీడియా ముందుకు రాబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లే అనుకోవాలి. రానా నటించవలసిన సినిమాలు ఇప్పటికే చాల పెండింగ్ లో ఉన్న నేపధ్యంలో రానా గురించి సురేశ్ బాబు పై ఒత్తిడి బాగా పెరుగుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: